MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar57ff119c-8735-4920-b843-771ae798c003-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar57ff119c-8735-4920-b843-771ae798c003-415x250-IndiaHerald.jpgఇదెక్కడి కాంబో ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా ? అవును నిజమే. వీరిద్దరూ కలిసి అసలు సినిమానే చేయలేదు అలాంటిది రానాకి సుక్కు హిట్ ఇవ్వటమేంటని అనుకుంటున్నారా! అయితే ఈ కధనం చదవాల్సిందే. నిజానికి దర్శకుడు సుకుమార్ తన సినిమాలు తాను చేసుకుంటూ మరోపక్క తన వద్ద శిష్యరికం చేస్తున్న వారిని దర్శకులని చేసే పనిలో ఉన్నాడు. అలా ఈయన స్కూల్ నుండి దాదపు చాలా మంది దర్శకులు బయటకు వచ్చారు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో సొంతంగా బ్యానర్ ప్రారంభించిన సుకుమార్ ఈ సంస్థ నుంచి తన శిష్యులను దర్శకుల్ని చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూsukumar;venkatesh;rana;kumaar;raj;sukumar;tarun;cinema;school;blockbuster hit;daggubati venkateswara rao;butter;vaishnav tej;raj tarun;tarun kumarపాపం రానా.. ఈసారైనా సుక్కూ ప్లస్ అవుతాడా ?పాపం రానా.. ఈసారైనా సుక్కూ ప్లస్ అవుతాడా ?sukumar;venkatesh;rana;kumaar;raj;sukumar;tarun;cinema;school;blockbuster hit;daggubati venkateswara rao;butter;vaishnav tej;raj tarun;tarun kumarMon, 08 Mar 2021 12:01:00 GMTసుకుమార్ తన సినిమాలు తాను చేసుకుంటూ మరోపక్క తన వద్ద శిష్యరికం చేస్తున్న వారిని దర్శకులని చేసే పనిలో ఉన్నాడు. అలా ఈయన స్కూల్ నుండి దాదపు చాలా మంది దర్శకులు బయటకు వచ్చారు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో సొంతంగా బ్యానర్ ప్రారంభించిన సుకుమార్ ఈ సంస్థ నుంచి తన శిష్యులను దర్శకుల్ని చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నాడు.

ఒక రకంగా అలా సుకుమార్ రైటింగ్స్ తో బ్యానర్ పెట్టి రాజ్ తరుణ్ కుమారి 21 f - వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చింది సుక్కూ శిష్యులే. ఇప్పుడు ఈ లిస్ట్ లో దగ్గుబాటి రానా కూడా చేరబోతున్నాడని అంటున్నారు. అదేమంటే సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. దీంతో సుక్కూ అసిస్టెంట్ వెంకీ అనే కుర్ర దర్శకుడి దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.

అయితే సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో నటించడం రానాకు ఇదే మొదటి సారి కాదు. ఆయన ఇంతకు ముందు సుకుమార్ శిష్యుడు ప్రకాశ్ తోలేటి తో 'నా ఇష్టం' అనే సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది, అసలు అలాంటి ఒక సినిమా ఉంటుందని కూడా ఎవరికీ పెద్దగా గుర్తు లేదు కూడా. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరోసారి సుకుమార్ శిష్యుడితో సినిమా చేయబోతున్నాడు రానా. మరి ఈసారైనా రానాకు సుక్కూ శిష్యరికం కలిసి వస్తుందా ? లేదో చూడాలి. ఇక త్వరలోనే సుక్కూ-రానా-వెంకీ కలయికకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.


దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>