Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/virat-kohli092c6734-b6b8-4be6-bcbf-972124c85011-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/virat-kohli092c6734-b6b8-4be6-bcbf-972124c85011-415x250-IndiaHerald.jpgఆసిస్ టూర్‌లో వైఫల్యం తరువాత నుంచి కోహ్లీపై విమర్శలు పెరిగాయి. అయితే, ఆసిస్‌తో సిరీస్ అనంతరం టీమిండియాలో యువ ప్లేయర్లు సంచలనం సృష్టిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో కీలక బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నా.. .జట్టు విజయాలు మాత్రం సాధ్యమవుతున్నాయి. రికార్డు విజయాలతో సిరీస్‌లు సొంతం చేసుకుంటున్నాయి. కాగా.. ఇప్పుడిదే విరాట్ కోహ్లీకి..virat kohli;naga;rohit;sundar;virat kohli;washington sundar;rohit sharma;india;england;naga aswin;media;rishabh pant;yuva;paruguఅశ్విన్, సుందర్ చేసిన పనికి.. అవమానంలో కోహ్లీ!అశ్విన్, సుందర్ చేసిన పనికి.. అవమానంలో కోహ్లీ!virat kohli;naga;rohit;sundar;virat kohli;washington sundar;rohit sharma;india;england;naga aswin;media;rishabh pant;yuva;paruguMon, 08 Mar 2021 10:07:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఆసిస్ టూర్‌లో వైఫల్యం తరువాత నుంచి కోహ్లీపై విమర్శలు పెరిగాయి. అయితే, ఆసిస్‌తో సిరీస్ అనంతరం టీమిండియాలో యువ ప్లేయర్లు సంచలనం సృష్టిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో  కీలక బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నా.. .జట్టు విజయాలు మాత్రం సాధ్యమవుతున్నాయి. రికార్డు విజయాలతో సిరీస్‌లు సొంతం చేసుకుంటున్నాయి. కాగా.. ఇప్పుడిదే విరాట్ కోహ్లీకి అవమానంగా మారింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌ ఇద్దరిలో ఏ ఒక్కరు చేసిన స్కోర్ కూడా కెప్టెన్ కోహ్లీ చేయకపోవడం ఇబ్బందిగా మారింది. దీనికి తోడు బౌలర్లు పరుగులు చేయడమే కాకుండా.. వికెట్ల కూడా పగడొట్టారు. ఇంకా మాట్లాడితే.. జట్టు విజయంలో వారి బౌలింగ్ ఎంత కీలకంగా నిలిచిందో వేరే చెప్పనక్కరల్లేదు. దీంతో  కోహ్లీపై సోషల్ మీడియా వేదికగా అనేకవమంది విమర్శలు గుప్పిస్తున్నారు.

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసింది ఇంగ్లండ్ కెప్టెన్ రూట్. మొత్తం సిరీస్‌లో డబుల్ సెంచరీతో సహా 368 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండవ స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీతో మొత్తం 345 పరుగులు చేశాడు. అదే సమయంలో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేసిన రిషబ్ పంత్ 270 పరుగులు చేశాడు. బెన్ స్టాక్స్ 203 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు.

ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఐదవ, ఆరవ స్థానంలో భారత బౌలర్లు అశ్విన్.. 189 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 181 పరుగులు.. ఉన్నారు. వీరిద్దరి తరువాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 4 మ్యాచ్‌ల్లో 172 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాదు.. మరింత దారుణం ఏంటంటే.. ఏకంగా జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలయితే మరింత దారుణ ప్రదర్శన చేశారు. అయినప్పటికీ.. కోహ్లీ కెప్టెన్ అయిఉండి కూడా పరుగుల జాబితాలో ఏడో స్థానంలో ఉండడం అతడి కెప్టెన్సీ విజయాలను కూడా వెనక్కి నెట్టేసింది. కెప్టెన్ అయి ఉండి ఇంత దారుణమైన బ్యాటింగ్ చేయడమేంటంటూ అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ దాదాపు రెండేళ్లుగా ఏ ఫార్మాట్‌లోనూ ఒక్క సెంచరీ కూడా చేయలేదు.




తెలంగాణ‌లో మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన క‌రోనా...ఆ మార్క్ దాటేసిన కేసులు

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>