PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ రాజ‌కీయాల్లో మాత్రం వైసీపీకి ఎదురుగాలి వీస్తోంద‌న్న‌ది వారి నివేదిక‌ల సారాంశం. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌ను మ‌రింత గ‌ట్టిగా తీసుకుని ప్ర‌చారం చేయాల‌ని.. వైసీపీని ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి తీసుకురావాల‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో జ‌గ‌న్ హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే మంత్రి కొడాలి నాని, పేర్ని నాని.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటూనే విజ‌య‌వాడ‌పై నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీలో విజ‌య‌వాడ jagan ysrcp;nani;kodali nani;nithya new;guntur;botcha satyanarayana;perni nani;minister;air;letter;ycp;sara shrawan;party;mantraపుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!పుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!jagan ysrcp;nani;kodali nani;nithya new;guntur;botcha satyanarayana;perni nani;minister;air;letter;ycp;sara shrawan;party;mantraMon, 08 Mar 2021 14:30:53 GMTవైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఒక‌టి ఆశిస్తే.. క్షేత్ర‌స్థాయిలో మ‌రొక‌టి జ‌రుగుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో వైసీపీని ప‌రుగులు పెట్టించి.. త‌న ప్ర‌బుత్వానికి ఎదురు లేద‌ని నిరూపించుకునేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధానంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌కు.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌ను రెఫెరెండంగా భావిస్తున్నారు. పైకి ఈ విష‌యం చెప్ప‌క‌పోయినా.. లోలోన మాత్రం ఇదే ఆలోచ‌న సాగుతోంది. ఈ క్ర‌మంలో మూడు రాజ‌ధానులకు అనుకూలంగా విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో గెలుపును నిర్ణ‌యించుకున్నారు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న పార్టీ నేత‌ల‌తోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెప్పుకొచ్చారు. దీంతో తొలుత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. త‌ర్వాత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు విజ‌య‌వాడ‌, గుంటూరు ప‌రిస్తితుల‌పై నివేదిక‌లు సిద్ధం చేశారు. గుంటూరులో ఫ‌ర్వాలేదు అనుకున్నా.. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో మాత్రం వైసీపీకి ఎదురుగాలి వీస్తోంద‌న్న‌ది వారి నివేదిక‌ల సారాంశం. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌ను మ‌రింత గ‌ట్టిగా తీసుకుని ప్ర‌చారం చేయాల‌ని.. వైసీపీని ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి తీసుకురావాల‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో జ‌గ‌న్ హెచ్చ‌రించారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి కొడాలి నాని, పేర్ని నాని.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటూనే విజ‌య‌వాడ‌పై నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీలో విజ‌య‌వాడ నేత‌లు క‌య్యాలు ప‌డుతున్నారు. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని వైసీపీ నాయ‌కులు భావించారు. అయితే.. అనూహ్యంగా ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు చంద్ర‌బాబు.. నేత‌ల‌ను సెట్ రైట్ చేశారు.

దీంతో ఇప్పుడు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా టీడీపీని కార్పొరేష‌న్‌లో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. మ‌రోవైపు.. వైసీపీలో మంత్రులు బాధ్య‌త తీసుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో రేష‌న్‌.. స‌హా ఇళ్ల ప‌ట్టాల పంపిణీ వంటివి విజ‌య‌వాడ‌లో స‌క్ర‌మంగా సాగ‌లేదు. ఇది వ్య‌తిరేక గాలులు వీచేలా చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ క‌ష్టం సార్! అంటూ.. వైసీపీలోనే గుస‌గుస‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.  


వన్డే చరిత్రలోనే అద్భుతం.. 43 ఫోర్లు, 14 సిక్స్‌లు.. ఆ బ్యాట్స్‌మెన్ ధాటికి గ్రైండ్ దద్దరిల్లిపోయింది

పుర పోరు : విజయసాయిరెడ్డి ఆ మచ్చ పోగొట్టుకుంటారా...?

'ఆటిజం' చిన్నారులకు అండగా నిలిస్తూ.. వేలాదిమంది పిల్లలకు దైవంగా మారిన శ్రీజా రెడ్డి..!!

రాఘవేంద్రరావు తొలిసారిగా ఏ హీరోయిన్ మీద పండు వేశారో తెలుసా..

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>