Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/videos490b47e5-0b55-4a1e-959f-83132d1f580c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/videos490b47e5-0b55-4a1e-959f-83132d1f580c-415x250-IndiaHerald.jpg తాజాగా కర్ణాటకలో వీడియోలు సీడీలు రాజేష్ అన్న వివాదం అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వీడియోలు సీడీలు అంటేనే అక్కడి నేతలు వణికిపోతున్నారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని టీవీల్లో,పత్రికల్లో ప్రసారం కాకుండా చూడాలంటూ మంత్రులు ఏకంగా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేష్ జార్కి హోళి అస్లీల వీడియో బయటకు రావడం ఆయన పదవి పోవడం తెలిసిందే. videos;sudhakar;kerala;bandara;karnataka - bengaluru;రాజీనామా;backward classes;media;cm;court;mla;minister;letter;central government;research and analysis wing;party;mantraవీడియో సీడీలు అంటేనే వణికిపోతున్న నేతలు...?వీడియో సీడీలు అంటేనే వణికిపోతున్న నేతలు...?videos;sudhakar;kerala;bandara;karnataka - bengaluru;రాజీనామా;backward classes;media;cm;court;mla;minister;letter;central government;research and analysis wing;party;mantraMon, 08 Mar 2021 02:00:00 GMTరాజేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వీడియోలు సీడీలు అంటేనే అక్కడి నేతలు వణికిపోతున్నారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని టీవీల్లో,పత్రికల్లో ప్రసారం కాకుండా చూడాలంటూ మంత్రులు ఏకంగా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేష్ జార్కి హోళి అస్లీల వీడియో బయటకు రావడం ఆయన పదవి పోవడం తెలిసిందే.


సిటీ సివిల్‌ కోర్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది. మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అలా పిటిషన్లను వేసిన ఆరుమంది మంత్రులను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించాలని జేడీఎస్‌ ఎమ్మెల్యే. సా.రా. మహేశ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మైసూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో ప్రసారం చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని ఆరుగురు మంత్రులు కోర్టును ఆశ్రయించారని, వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అన్నారు.

మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ వీడియోల గురించి డిమాండ్లు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు.ఇదిలా ఉండగా  తప్పు చేయనప్పుడు భయం ఎందుకని  కోర్టును ఎందుకు ఆశ్రయించారని మహేశ్‌ ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే ఆ వీడియోల ద్వారా బండారం బయటపడుతుందని ఆందోళన చెందుతున్నారని అభిప్రాయపడ్డారు. అలా జరగకుండా తప్పించుకునేందుకే కోర్టుకెళ్లారు అని ఆరోపించారు. ముంబైకి వెళ్లిన మంత్రులు అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఎద్దేవా చేశారు.


పలువురు ప్రతిపక్ష నేతలు ఇదే తరహాలో ఆరోపణలు సంధించారు.మరోవైపు కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ స్పందిస్తూ తమ సీడీలను విడుదల చేయరాదని కొందరు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లడం సరికాదని అన్నారు. ఆయన బెంగళూరు కేసీ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని విలేకర్లతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సమాచారం పంపించారు. మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేరళ సీఎంపై బంగారం స్మగ్లింగ్‌ వంటి బలమైన ఆరోపణలు వచ్చినందున ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


తలనొప్పిని తగ్గించే చిట్కాలు...?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>