MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-batte3f5f232-8fbd-4275-994b-fc8bc6dd3eb1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-batte3f5f232-8fbd-4275-994b-fc8bc6dd3eb1-415x250-IndiaHerald.jpgమహేష్ భట్ ముద్దుల కుమార్తె పూజాభట్ సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన డాడీ సినిమాతో ఆమె వెండి తెరకు పరిచయం అయ్యారు.pooja batt;mahesh;mahesh bhatt;sanjay dutt;tara;mumbai;cinema;2020;hero;silver;heroine;international;romantic;fatherతొలిసారిగా ఆయనకే ముద్దు పెట్టా.. ఎలా పెట్టాలో నా తండ్రే చెప్పాడు: పూజాభట్తొలిసారిగా ఆయనకే ముద్దు పెట్టా.. ఎలా పెట్టాలో నా తండ్రే చెప్పాడు: పూజాభట్pooja batt;mahesh;mahesh bhatt;sanjay dutt;tara;mumbai;cinema;2020;hero;silver;heroine;international;romantic;fatherMon, 08 Mar 2021 11:00:00 GMT
మహేష్ భట్ ముద్దుల కుమార్తె పూజాభట్ సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన డాడీ సినిమాతో ఆమె వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించి పలు అవార్డులను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ 49 ఏళ్ల ముద్దుగుమ్మ తన తొలి ముద్దు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సడక్ సినిమాలో భాగంగా తాను తన 18 ఏళ్ళ వయస్సులోనే కెమెరా ముందు మొదటిసారిగా హీరో సంజయ్ దత్ ని ముద్దు పెట్టుకున్నానని ఆమె చెప్పారు. అప్పటికే సంజయ్ దత్ ఒక స్టార్ హీరోగా కొనసాగుతున్నారట. ఐతే ప్రతిరోజు సినిమా పోస్టర్లపై చూసే తనకిష్టమైన హీరో ని ముద్దు పెట్టుకోవడం తనకు ఒక సరికొత్త అనుభూతిని కలిగించిందని ఆమె అన్నారు. కానీ తొలిసారిగా ముద్దు పెట్టుకునే సమయంలో ఆమె చాలా ఆందోళనకు గురయ్యారట.

దీంతో ఆ సినిమాకి దర్శకుడు అయిన మహేష్ భట్ పూజాభట్ ని పక్కకి పిలిచి.. "ముద్దు పెట్టుకునేటప్పుడు నువ్వు వల్గర్ గా ఫీల్ అయితే ప్రేక్షకులు కూడా వల్గర్ గా ఫీలవుతారు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు మనసులో చెడుగా ఫీలవకుండా.. చాలా అమాయకంగా, సహజంగా, ఆత్మగౌరవంతో ఉండాలి. అప్పుడే ఏ సన్నివేశం అయినా మంచి గా పండుతుంది" అని చెప్పారట.

అయితే మహేష్ నుంచి నేర్చుకున్న తొలి పాఠం ఇదేనని ఆమె చెబుతున్నారు. తన ప్రతి సినిమాలో ఇదే సూత్రాన్ని పాటించి సులువుగా రొమాంటిక్ సన్నివేశాలను పూర్తి చేసేదాన్ని అని ఆమె అన్నారు. చివరిసారిగా ఆమె 2020 లో విడుదలైన సడక్ 2 చిత్రం లో నటించి మెప్పించారు. నెట్ ఫ్లిక్ లో రాబోతున్న బొంబాయి బేగమ్స్ వెబ్ సిరీస్ లో ఈమె నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సాయంత్రం సమయం నుంచి ప్రసారం కానున్నది.


బెజవాడ టీడీపీ చల్లబడటం కష్టమేనా...?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>