PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections1a828dbd-56d0-4ed5-a6f8-a70bf8d30a06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections1a828dbd-56d0-4ed5-a6f8-a70bf8d30a06-415x250-IndiaHerald.jpgనేటితో ఏపిలో మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ఈ గడువు ముగియనుంది. ఎల్లుండి అంటే పదో తేదీన దాదాపు 75 మున్సిపాల్టీలు 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కడపలో టీడీపీ నేతలు ప్రచారంలో జోరు పెంచినట్లు తెలుస్తోంది. ప్రచారానికి అవకాశమున్న చివరిరోజు అవడంతో ఎక్కువ వార్డులను చుట్టేసేందుకు వివిధ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు తాము వెళ్లలేకపోయిన వార్డుల్లో మైకులతో కూడిన ప్రచార వాహనాలను ఎక్కువగాap-municipal-elections;cbn;bharatiya janata party;jagan;adinarayanareddy;kadapa;chief minister;mla;tdp;ycp;badvel;partyపుర పోరు: ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ..పుర పోరు: ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ..ap-municipal-elections;cbn;bharatiya janata party;jagan;adinarayanareddy;kadapa;chief minister;mla;tdp;ycp;badvel;partyMon, 08 Mar 2021 10:06:31 GMTటీడీపీ నేతలు ప్రచారంలో జోరు పెంచినట్లు తెలుస్తోంది. ప్రచారానికి అవకాశమున్న చివరిరోజు అవడంతో ఎక్కువ వార్డులను చుట్టేసేందుకు వివిధ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు తాము వెళ్లలేకపోయిన వార్డుల్లో మైకులతో కూడిన ప్రచార వాహనాలను ఎక్కువగా తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


 జిల్లాలో గట్టి పోటీ ఉన్న ప్రాంతాల్లో అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. ఓటర్ల మద్దతు కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించి తమను గెలిపించాలని వైకాపా అభ్యర్థులు కోరుతున్నారు.రెబల్స్ తో వైసీపీ కి భయం పట్టుకుంది.కడప నగరపాలక సంస్థలో గత ఎన్నికల్లో కంటే ఎక్కువ డివిజన్లను కైవసం చేసుకుని తమ సత్తా చాటేందుకు ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు కృషి చేస్తున్నారు.కడపలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు అన్నీ తానై పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ప్రొద్దుటూరు పురపాలకలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
 

టీడీపీ వర్సెస్ వైసీపీ ఉన్న మైదుకూరు, బద్వేలు పురపాలకలో ఛైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీడీపీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. బద్వేలులో కొన్నిచోట్ల తెదేపా అభ్యర్థులు బరిలో లేకపోవడంతో స్వతంత్రులను గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగులో ఎన్నికలను భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వైసిపి అలాగే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రచారాన్ని హోరెత్తుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ కి సంబంధించి అధినేత చంద్రబాబుతో సహా మిగతా అందరూ రోడ్డెక్కి ప్రచారం చేస్తున్నారు. అధికార వైసీపీలో సైతం ముఖ్యమంత్రి జగన్ తప్ప మిగతా అందరూ రోడ్డెక్కి ప్రచారంలో పాల్గొంటున్నారు.ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి..


తెలంగాణ‌లో మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన క‌రోనా...ఆ మార్క్ దాటేసిన కేసులు

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>