PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-road-show780886aa-2b8f-461e-8f96-1ac00f6c69a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-road-show780886aa-2b8f-461e-8f96-1ac00f6c69a1-415x250-IndiaHerald.jpgకనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, అమ్మవారి చీరలను కాజేసి అమ్ముకునేవాడు దేవదాయ మంత్రా? ఆయన హయాంలో దుర్గగుడిలో అవినీతి కంపు కొడుతోంది. అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు మాయమైపోయినా అతీగతీ లేదు. పుంగనూరు పుడింగి కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నాడు. ఈ పుడింగికి కృష్ణానదిలో కొంత భాగాన్ని, ఇంకో మంత్రికి మరో బిట్టును ధారాదత్తం చేసి మొత్తం దోచుకుంటారంటchandrababu road show;jeevitha rajaseskhar;ramu;krishna river;jagan;district;cinema;vishakapatnam;minister;krishna district;silver;tdp;ycp;rama tirtha;mantraవామ్మో చంద్రబాబు! సినిమా చూపించాడు..వామ్మో చంద్రబాబు! సినిమా చూపించాడు..chandrababu road show;jeevitha rajaseskhar;ramu;krishna river;jagan;district;cinema;vishakapatnam;minister;krishna district;silver;tdp;ycp;rama tirtha;mantraMon, 08 Mar 2021 09:19:30 GMTటీడీపీ అధినేత చంద్రబాబు విశ్వరూపం చూపించారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిధులపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రులను చీల్చి చెండాడాడు చంద్రబాబు.

కనకదుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు, అమ్మవారి చీరలను కాజేసి అమ్ముకునేవాడు దేవదాయ మంత్రా? ఆయన హయాంలో దుర్గగుడిలో అవినీతి కంపు కొడుతోంది. అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు మాయమైపోయినా అతీగతీ లేదు. రామతీర్థంలో రాముడి తల నరికేసినా పట్టించుకోడు. జగన్మాత కనకదుర్గమ్మ కొలువైన స్థానంలో అవినీతి కంపు కొడుతుంటే మీకు రోషం రావడం లేదా? నాపై అభిమానం లేకపోయినా.. కనీసం ఆ దేవతపైనైనా అభిమానం ఉండాలి. అమ్మవారి రథంపై వెండి సింహాలు మాయమైపోతే కనబడదా మీకు? ఆ తల్లి కన్నెర్రజేస్తే తప్ప మీరు కళ్లు తెరవరా? ఏమైంది మీ రోషం? ఏమైంది.

రాష్ట్ర మంత్రి కొడాలిపై చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఎంత సింపుల్ సమాధానం. తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడు. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా?’’ అంటూ కొడాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పుంగనూరు పుడింగి కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నాడు. ఈ పుడింగికి కృష్ణానదిలో కొంత భాగాన్ని, ఇంకో మంత్రికి మరో బిట్టును ధారాదత్తం చేసి మొత్తం దోచుకుంటారంట! రెండేళ్లుగా సామాన్యులకు గంపెడు ఇసుక దొరకకుండా మొత్తం బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్క జిల్లాలో మరో హవాలా మంత్రి ఉన్నాడు. వీళ్లంతా మంత్రులా? జగన్‌ బంట్రోతులు. జగన్‌ పత్రికలో గుమాస్తాగా పని చేసిన మరో వ్యక్తి నాకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నా రాజకీయ జీవితంలో ఈ గుమాస్తా ఎంత? ఇలాంటి వారిని చాలామందినే చూశాను. బెదిరింపులకు భయపడేవాడిని కాదు. విశాఖపట్నంలో ఏ-2.. 10 వేల ఎకరాల భూములను కబ్జా చేసేశాడు. అక్కడ కోటీశ్వరుల ఆస్తులను భయపెట్టి రాయించేసుకుంటున్నాడు. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను నేరస్థులకు అడ్డాగా మార్చేశారు. రాష్ట్రం వాళ్లబ్బ జాగీరనుకుంటున్నారా? అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.




womens-day : 21 రోజుల్లో 75 వేల మంది కడుపు నింపిన బాపుగారి బొమ్మ.!

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>