PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections9b20306f-788f-414b-98c6-236680c3c3a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-elections9b20306f-788f-414b-98c6-236680c3c3a6-415x250-IndiaHerald.jpgఏపిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.. ఈ మేరకు జిల్లాల్లో నేతలు ప్రచారం లి జోరు పెంచారు. ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రణాళికలను వేస్తున్నారు. టీడీపీ వర్సెస్ వైసీపీ పంతం కడప జిల్లాలో కనపడుతుంది.. కడప జిల్లాలోని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలపై వైసీపీ దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా మైదుకూరు లో టీడీపీ కార్యకర్తల పై వైసీపీ అన్యాయంగా కేసులు పెట్టడంతో పాటుగా కిడ్నాప్ కూడా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ap-municipal-elections;jagan;kadapa;police;hushaaru;arrest;tdp;traffic police;ycp;mydukurపుర పోరు: మైదుకూరు లో వెనక్కు తగ్గిన టీడీపీ..ప్రచారంలో ఫ్యాన్ స్పీడ్..పుర పోరు: మైదుకూరు లో వెనక్కు తగ్గిన టీడీపీ..ప్రచారంలో ఫ్యాన్ స్పీడ్..ap-municipal-elections;jagan;kadapa;police;hushaaru;arrest;tdp;traffic police;ycp;mydukurMon, 08 Mar 2021 12:00:00 GMTటీడీపీ వర్సెస్ వైసీపీ పంతం కడప జిల్లాలో కనపడుతుంది.. కడప జిల్లాలోని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలపై వైసీపీ దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా మైదుకూరు లో టీడీపీ కార్యకర్తల పై వైసీపీ అన్యాయంగా కేసులు పెట్టడంతో పాటుగా కిడ్నాప్ కూడా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


అందుకు ఉదాహరణగా మైదుకూరు మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి ధనపాల జగన్ అరెస్ట్.. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళిన ఆయనను రాత్రి వేళల్లో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేయడం రాజకీయ చర్చలకు కారణమైంది. ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని కుటుంబ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అక్కడకు చేరుకుని కనీస సమాచా రం లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో జగన్‌ను బలవంతం గా తీసుకెళ్లారు..


జగన్  ఆర్వో గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు లోనికి అనుమతించలేదు.. అక్కడున్న పోలీసు అధికారులు జగన్‌ను గేటు వరకు తోసుకుంటూ తీసుకెళ్లారు. అయితే తనపట్ల జగన్‌ దురుసుగా ప్రవర్తించారని.. ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైదుకూరులో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ చైర్మెన్ టీడీపీ అభ్యర్థి జగన్ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌ ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. పుట్టాసుధాకర్ యాదవ్, రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ ఘటన తో టీడీపీ నేతలు ప్రచారానికి వెనకడుగు వేశారు.. వైసీపీ నేతలు మాత్రం ఇంకాస్త హుషారుగా సంబరాలు చేసుకుంటూ ప్రచారంలో స్పీడ్ పెంచారు.


పాపం రానా.. ఈసారైనా సుక్కూ ప్లస్ అవుతాడా ?

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>