PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-pak-china-weapons03b2b903-f64c-45c6-bd56-a3683694060d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-pak-china-weapons03b2b903-f64c-45c6-bd56-a3683694060d-415x250-IndiaHerald.jpgమన దేశ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనికుల చేతికి ఓ బ్రహ్మాస్త్రం అందుబాటులోకి వచ్చేసింది. ఇది భారత సైనికులకు శుభవార్త కాగా.. మన పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ సైనికులకు మాత్రం వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత సైనికుల చేతికి నేటి నుంచి ఇజ్రాయెల్‌ తుపాకులు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ ఇజ్రాయల్ తుపాకుల రాకతో దేశ ఉత్తర సరిహద్దుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల పోరాట సామర్థ్యం మరింత పెరగుతుంది. అయితే.. ఏంటీ ఇజ్రాయెల్ తుపాకులు.. ఏంటీ వాటి గొప్పదనం.. india-pak-china-weapons;varsha;india;pakistan;israelభారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?india-pak-china-weapons;varsha;india;pakistan;israelMon, 08 Mar 2021 11:00:00 GMTపాకిస్తాన్ సైనికులకు మాత్రం వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత సైనికుల చేతికి నేటి నుంచి ఇజ్రాయెల్‌ తుపాకులు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ ఇజ్రాయల్ తుపాకుల రాకతో  దేశ ఉత్తర సరిహద్దుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల పోరాట సామర్థ్యం మరింత పెరగుతుంది.

అయితే.. ఏంటీ ఇజ్రాయెల్ తుపాకులు.. ఏంటీ వాటి గొప్పదనం.. ఓసారి చూద్దాం.. ఎన్‌జీ-7 చాలా పవర్‌ఫుల్.. ప్రస్తుతం మన సైనికులు ఇన్సాస్‌ ఎల్‌ఎంజీ తుపాకులు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ తుపాకులు వాటిని భర్తీ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ మన సైనికులు వాడుతున్న  ఇన్సాస్‌.. 5.56×45 ఎంఎం తూటాలను ప్రయోగిస్తుంది. కానీ ఈ కొత్త ఇజ్రాయెల్ తుపాకీ.. ఎన్‌జీ-7 నుంచి మరింత శక్తిమంతమైన 7.62×51 ఎంఎం తూటాలు వస్తాయి.

అలాగే ఇన్సాస్‌కు మ్యాగజైన్‌ ద్వారా బులెట్లు పెట్టాలి. అందువల్ల కాల్పుల సమయంలో ఈ మేగజైన్‌ ఎప్పటి కప్పుడు మార్చుకుంటూ ఉండాలి. కానీ ఈ ఎన్‌జీ-7కు బెల్టులా తూటాలను అందించొచ్చు. అందువల్ల దీంతో నాన్‌ స్టాప్‌గా బులెట్లు వర్షం కురిపించొచ్చు. ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే.. నిమిషానికి 700 తూటాలు పేల్చొచ్చు. అంతే కాదు.. ఈ తుపాకితో 800 మీటర్ల దూరంలోని టార్గెట్లను కూాడ మిస్ కాకుండా ఫైర్ చేయొచ్చు. దీని బరువు కూడా అంత ఎక్కువ కాదు.. 7.5 కిలోలే.

అంతేనా.. ఈ తుపాకీని వాహనాలు, హెలికాప్టర్లు, యుద్ధనౌకలకూ అమర్చి కాల్చవచ్చు. అందుకే పాక్, చైనా తో ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇండియా వీటిని ఇజ్రాయెల్ నుంచి అత్యవసర కొనుగోలు ప్రక్రియ కింద కొనుగోలు చేసింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో 6వేల తుపాకులు వచ్చాయి. రెండో విడత కింద 10వేల ఎన్‌జీ-7 తుపాకులు ఈ ఏడాది అక్టోబర్‌లో వస్తాయి. రూ.880 కోట్లతో 16,479 ఎల్‌ఎంజీలకు గత ఏడాది మార్చిలో భారత్‌ ఆర్డర్లు ఇచ్చింది.




ప్రపంచ మహిళా దినోత్సవం రోజు దారుణం...!

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>