EditorialGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-ap-tdp-latest4663aa87-1ec0-4ddd-b33a-ecb142597494-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-ap-tdp-latest4663aa87-1ec0-4ddd-b33a-ecb142597494-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అంటే అభివృద్ధికి చిరునామా.. సంప‌ద సృష్టికి సృష్టిక‌ర్త‌.. నూత‌న మార్గాల అన్వేష‌కుడు.. ఆర్థిక రంగానికి మార్గ‌నిర్దేశ‌కుడు.. వ్యూహాల‌కే ప‌ద్మవ్యూహం అల్లేయ‌గ‌ల చాణ‌క్యుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలావుంటాయి. ఏనాడూ తొణ‌క్కుండా.. బెణ‌క్కుండా నిల‌బ‌డిన వ్య‌క్తి. అటువంటి చంద్ర‌బాబునాయుడికి కూడా కోపం వ‌చ్చింది. త‌న రాజ‌కీయ జీవితం ఆసాంతం ఎక్క‌డా ప్ర‌త్య‌ర్థుల‌పై మాట తూల‌ని వ్య‌క్తి. ఆచి తూచి మాట్లాడ‌తారు. chandrababu, ap, tdp, latest;view;chiranjeevi;jeevitha rajaseskhar;tara;telugu desam party;y. s. rajasekhara reddy;congress;telugu;fire;party;mantraతుపాకీ తూటాలుతుపాకీ తూటాలుchandrababu, ap, tdp, latest;view;chiranjeevi;jeevitha rajaseskhar;tara;telugu desam party;y. s. rajasekhara reddy;congress;telugu;fire;party;mantraMon, 08 Mar 2021 06:56:36 GMTతెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి  నారా చంద్ర‌బాబునాయుడు అంటే అభివృద్ధికి చిరునామా.. సంప‌ద సృష్టికి సృష్టిక‌ర్త‌.. నూత‌న మార్గాల అన్వేష‌కుడు.. ఆర్థిక రంగానికి మార్గ‌నిర్దేశ‌కుడు.. వ్యూహాల‌కే ప‌ద్మవ్యూహం అల్లేయ‌గ‌ల చాణ‌క్యుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలావుంటాయి. ఏనాడూ తొణ‌క్కుండా.. బెణ‌క్కుండా నిల‌బ‌డిన వ్య‌క్తి.  అటువంటి చంద్ర‌బాబునాయుడికి కూడా కోపం వ‌చ్చింది. త‌న రాజ‌కీయ జీవితం ఆసాంతం ఎక్క‌డా ప్ర‌త్య‌ర్థుల‌పై మాట తూల‌ని వ్య‌క్తి. ఆచి తూచి మాట్లాడ‌తారు.  బెజ‌వాడ రోడ్‌షోలో మ‌రి చంద్ర‌బాబుకు ఎందుకు కోపం వ‌చ్చింది? ప‌్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన మాట‌ల తూటాల‌ను ఎందుకు వ‌దిలారు? ఎర్ర‌టి ఎండ‌లో ఎందుకు చంద్ర‌డ‌నిప్పులు చెరిగారు?.

మారుతున్న కాలానికి అనుగుణంగా మ‌నం కూడా మారితేనే మ‌నుగ‌డ సాధ్య‌ప‌డుతుంది. మార‌క‌పోతే వెన‌క‌బ‌డిపోతాం. అలా మారేవారే నిజ‌మైన విజేత‌ల‌వుతారు. ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా ఇప్పుడు ఈ ధోర‌ణినే అవ‌లంబిస్తున్నారు. విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి వ‌చ్చిన బాబు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల‌కుల‌పై నిప్పులు చెరిగారు. మంత్రుల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక‌ర‌కంగా అంద‌రినీ చెడామ‌డా తిట్టేశారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు కూడా చంద్ర‌బాబు మాట‌తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.

ప్ర‌తి 16 సంవ‌త్స‌రాల‌కు ఒక జ‌న‌రేష‌న్ మార్పు చోటుచేసుకుంటుంది. అలా మ‌న జీవిత‌కాలంలో ఎన్ని జ‌న‌రేష‌న్లు చూడ‌గ‌లిగితే అంత చూస్తాం. దానికి అనుగుణంగానే మార్పులు జ‌రుగుతుంటాయి. ఆ మార్పుల‌ను ఒంట‌బ‌ట్టించుకుంటే జ‌న‌రేష‌న్ గ్యాప్ అనేది లేకుండా అంద‌రితో ముందుకువెళ‌తాం. అదే సూత్రాన్ని చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్నారు. పాత‌త‌రం రాజ‌కీయ‌వేత్త అయిన‌ప్ప‌టికీ కొత్త‌త‌రానికి ఏం కావాలో తెలుసుకొని త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాడు. నేరుగా ప‌దునైన మాట‌ల‌తో ప్ర‌త్య‌ర్థులను విమ‌ర్శించ‌క‌పోతే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని గుర్తించారు. ఇప్ప‌టి త‌రానికి ఏం కావాలో తెలుసుకొని అందుకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళ్లే మాట‌లైతే తుపాకీ తూటాలా పేల‌తాయ‌ని గుర్తించారు. త‌న ధోర‌ణి మార్చుకున్నారు. త‌న‌ను తాను మార్చుకుంటున్నారు. పాత త‌రానికి, కొత్త త‌రానికి మ‌ధ్య వార‌ధిగా ప‌నిచేస్తూ తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.


వన్ మిషన్... టూ గోల్స్! విపక్షాలపై కేసీఆర్ బ్రహ్మాస్త్రం

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..

గట్టిగా కౌంటర్ ఇచ్చిన రేణుదేశాయ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>