PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-267-candidates-withdraw-nomination-c0f6244b-d28d-4bfc-88b8-dda7517b634b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-267-candidates-withdraw-nomination-c0f6244b-d28d-4bfc-88b8-dda7517b634b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మైకులు అన్నీ మూగ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గత వారం పది రోజుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అనుచరులతో సందడిగా మారిన పురవీధులు అన్ని బోసిపోనున్నాయి. ఇక ప్రచారం ముగిసిన వెంటనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. అయితే ఇప్పటికే చాలా చోట్ల అభ్యర్థుల తరపున కొంతమంది రంగంలోకి దిగి ప్రలోభాల ప్రక్రియ చేపట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానిap municipal elections;view;amala akkineni;prasanna;hyderabad;andhra pradesh;karnataka - bengaluru;district;smart phone;police;google;bus;tdp;google pay app;kadiri;master;party;puttaparthiపుర పోరు : అనంతలో ఓట్ల కొనుగోలుకు నేతల మాస్టర్ ప్లాన్.. పోలీసులు అవాక్కయ్యేలా ..పుర పోరు : అనంతలో ఓట్ల కొనుగోలుకు నేతల మాస్టర్ ప్లాన్.. పోలీసులు అవాక్కయ్యేలా ..ap municipal elections;view;amala akkineni;prasanna;hyderabad;andhra pradesh;karnataka - bengaluru;district;smart phone;police;google;bus;tdp;google pay app;kadiri;master;party;puttaparthiMon, 08 Mar 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మైకులు అన్నీ మూగ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గత వారం పది రోజుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అనుచరులతో సందడిగా మారిన పురవీధులు అన్ని బోసిపోనున్నాయి. ఇక ప్రచారం ముగిసిన వెంటనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. అయితే ఇప్పటికే చాలా చోట్ల అభ్యర్థుల తరపున కొంతమంది రంగంలోకి దిగి ప్రలోభాల ప్రక్రియ చేపట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎత్తుగడలు వేస్తున్నారు. 

వార్డుల వారీగా విభజించి మరీ ఓటర్లకు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ లు తీసుకుని వారికి డబ్బు పంపిణీ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్ తో పాటు ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, కదిరి మున్సిపాలిటీలు అలాగే మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీల పరిధిలో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు ఇలాంటి వాటికి ఎక్కువగా పాల్పడుతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా తృణమో పణమో చేతిలో పెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 

అలాగే అధికార పార్టీ నేతలు ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉండడంతో అక్కడ నుంచి మద్యం పెద్ద ఎత్తున తెప్పించి పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదీకాక జిల్లాకు చెందిన యువత ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారందరినీ బస్సులు పెట్టి మరి మున్సిపాలిటీలకు రప్పించి ఓట్లు వేయించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు కూడా వీటిని అడ్డుకట్ట వేయడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ అభ్యర్థుల తెలివితేటల ముందు పోలీసులు తేలిపోతున్నారు అనేది మాత్రం చెప్పక తప్పదు.




దూసుకుపోతున్న ఉప్పెన బ్యూటీ.. టాలీవుడ్లోనే కాదు అక్కడ ఆఫర్ కొట్టేసింది..?

40 సంవత్సరాలు దాటినా చాలా మంది హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

రోజా గోడదూకి వెళ్లిపోయేది.. నాకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదు: మీనా

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>