CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/sweet-corn-paayasam0802afd6-66e9-4b0e-bf48-9e115267b6c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/sweet-corn-paayasam0802afd6-66e9-4b0e-bf48-9e115267b6c4-415x250-IndiaHerald.jpgస్వీట్ కార్న్ ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది సాయంత్రం వేళ మంచి స్నాక్ గా తినటానికి చాలా బాగుంటుంది. దీంతో మనం రుచికరమైన పాయసం చేసుకోని తినవచ్చు. ఇక రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం ఎలా తయారు చెయ్యాలో ఈరోజు తెలుసుకోండి. మీరు ట్రై చెయ్యండి. ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.... స్వీట్ కార్న్ పాయసానికి కావలసిన పదార్ధాలు... స్వీట్‌ కార్న్‌ - 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి), చిక్కటి పాలు - 4 కప్పులు, నెయ్యి - పావు కప్పు, పంచదార - అర కప్పుSweet corn paayasam;pistachio;corn;mixie;gheeరుచికరమైన స్వీట్ కార్న్ పాయసం ఎలా చెయ్యాలో తెలుసుకోండి......రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం ఎలా చెయ్యాలో తెలుసుకోండి......Sweet corn paayasam;pistachio;corn;mixie;gheeMon, 08 Mar 2021 12:00:00 GMTస్వీట్ కార్న్ ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది సాయంత్రం వేళ మంచి స్నాక్ గా  తినటానికి చాలా బాగుంటుంది. దీంతో మనం రుచికరమైన పాయసం చేసుకోని తినవచ్చు. ఇక రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం ఎలా తయారు చెయ్యాలో ఈరోజు తెలుసుకోండి. మీరు ట్రై చెయ్యండి. ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు....

స్వీట్ కార్న్ పాయసానికి కావలసిన పదార్ధాలు...

స్వీట్‌ కార్న్‌ - 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి),
చిక్కటి పాలు - 4 కప్పులు,
నెయ్యి - పావు కప్పు,
 పంచదార - అర కప్పు,
ఏలకుల పొడి - 1 టీ స్పూన్‌,
పిస్తా,
కిస్‌ మిస్,
జీడిపప్పు,
బాదం పప్పు - 2 టేబుల్‌ స్పూన్‌ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు - చిటికెడు

స్వీట్ కార్న్ పాయసం తయారు చేసే విధానం....

ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్‌ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్‌ తీసుకుని అందులో కార్న్‌ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసి, కళాయిలో 4 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్‌ - పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ.. అడుగంటకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్‌ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్‌ కార్న్‌ పాయసం.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం మీరు ఇంట్లో ట్రై చెయ్యండి....



పాపం రానా.. ఈసారైనా సుక్కూ ప్లస్ అవుతాడా ?

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>