PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sons-body2654ac98-7dd2-4641-aadf-ed45b44dc3d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sons-body2654ac98-7dd2-4641-aadf-ed45b44dc3d3-415x250-IndiaHerald.jpgమనిషికి మానవత్వం అనేది చాల అవసరం. కానీ, చాలా సార్లు ఆ సమయం వచ్చినప్పడు ప్రజలు మానవత్వం చూపించడం మరిచిపోతారు. బీహార్‌లోని కతిహార్‌లో తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన 13 ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని ఒక ముతక బస్తాలో వేసుకుని మూడు కిలోమీటర్ల దూరం నడిచాడు. ఈ పరిస్థితుల్లో ఎవరూ అతనికి సహాయం చేయలేదు. పోలీసులు కూడా కనీస మానవత్వం లేకుండా వ్యవరించారు. sons body;thirtha;police;police station;traffic police;fatherకొడుకు మృతదేహంతో 3 కిలోమీటర్లు నడిచిన తండ్రి ఎక్కడంటే..!?కొడుకు మృతదేహంతో 3 కిలోమీటర్లు నడిచిన తండ్రి ఎక్కడంటే..!?sons body;thirtha;police;police station;traffic police;fatherMon, 08 Mar 2021 06:00:00 GMT
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భాగల్పూర్‌లో నీరు యాదవ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని 13 ఏళ్ల కుమారుడు హరియోమ్ యాదవ్ తీర్థంగ గ్రామం వద్ద పడవలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఆ తరువాత అతను కనిపించలేదు. ఈ విషయంపై నీరు యాదవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

తరువాత, కరీహార్లోని కుర్సోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఖేరియా నది సమీపంలో హరియోమ్ యాదవ్ మృతదేహం లభ్యమైంది. డెడ్‌బాడీ గురించి నీరు యాదవ్‌కు సమాచారం ఇచ్చారు పోలీసులు. అతను సంఘటన స్థలానికి చేరుకుని చూడగా మృతదేహం గుర్తుపట్టలేనివిధంగా మారిపోయింది. జంతువులు అతని మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. అయితే, వేసుకున్న బట్టలతో పాటు ఇతర శరీర భాగాల ఆధారంగా మృతదేహం తన కుమారుడిదే అని గుర్తించాడు నీరు యాదవ్.

అయితే ఆశ్చర్యకరంగా, ఈ విషయంలో భారుపూర్ పోలీసులు కానీ, కతిహార్ పోలీసులు నీరు యాదవ్ కనీసం మానవం చూపలేదు. మృతదేేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ కూడా అందించలేదు. దీంతో చేసేదేం లేక నీరు యాదవ్ కొడుకు మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి..  సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటివరకు నడుచుకుంటూ వెళ్లాడు.  “ఎవరూ నాకు సహాయం చేయలేదు, కనీసం సానుభూతి చూపలేదు” అని నీరు యాదవ్ చెప్పారు. ఈ సంఘటన మరోసారి ‘మానవత్వం’ పై ప్రపంచానికి ప్రశ్నలు సంధించింది.




అశ్విన్, సుందర్ చేసిన పనికి.. అవమానంలో కోహ్లీ!

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>