MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/womens-day8e78db51-8487-44f6-b050-fd1ff622d3bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/womens-day8e78db51-8487-44f6-b050-fd1ff622d3bf-415x250-IndiaHerald.jpgకలువ కళ్ల భామ ప్రణీత సుభాష్ భావ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు ముందే ప్రణీత తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన మహేష్ బాబు సినిమా పోకిరి కన్నడ రీమేక్ నటించి అలరించింది. ఇక తెలుగులో బావ సినిమా తో పాటు "ఏం పిల్లో ఏం పిలడో, రభస, డైనమైట్, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద" లాంటి సినిమాలతో అలరించింది. తెలుగు కన్నడ సినిమాలే కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద కళ్ళతో పాలలాంటి చర్మం తో భువి నుండి దిగి వచ్చిన దేవ కన్యలాwomens-day;health;mahesh;abinaya;bapu;bhama;deva;pranitha subhash;mohandas karamchand gandhi;tollywood;cinema;telugu;tamil;kannada;hindi;remake;success;pokiri;attharintiki daredi;v;bapu1womens-day : 21 రోజుల్లో 75 వేల మంది కడుపు నింపిన బాపుగారి బొమ్మ.!womens-day : 21 రోజుల్లో 75 వేల మంది కడుపు నింపిన బాపుగారి బొమ్మ.!womens-day;health;mahesh;abinaya;bapu;bhama;deva;pranitha subhash;mohandas karamchand gandhi;tollywood;cinema;telugu;tamil;kannada;hindi;remake;success;pokiri;attharintiki daredi;v;bapu1Mon, 08 Mar 2021 09:35:15 GMTభామ ప్రణీత సుభాష్ భావ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు ముందే ప్రణీత తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన మహేష్ బాబు సినిమా పోకిరి కన్నడ రీమేక్ నటించి అలరించింది. ఇక తెలుగులో బావ సినిమా తో పాటు "ఏం పిల్లో ఏం పిలడో, రభస, డైనమైట్, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద" లాంటి సినిమాలతో అలరించింది. తెలుగు కన్నడ సినిమాలే కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు  చేసి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.  పెద్ద పెద్ద కళ్ళతో పాలలాంటి చర్మం తో భువి నుండి దిగి వచ్చిన దేవ కన్యలా కనిపించే ప్రణీత.. కేవలం అందం అభినయం లోనే కాకుండా తన  అందమైన మనస్సుతో అందరి హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ప్రణీత లాక్ డౌన్ వేళ ఆకలితో అలాంటిస్తున్నవారికి భోజనాలు ఏర్పాటు చేసి వారి కడుపు నింపింది. రోజూ కూలీ చేసి జీవనం గడిపే 50 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున మొత్తం అలా లక్ష రూపాయలు ఇచ్చి వారికి అండగా నిలిచింది. అంతే కాకుండా 21 రోజుల్లో ప్రణీత 75 మందికి భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చింది.

లాక్ డౌన్ సమయంలో హెల్ప్ ది హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో పది లక్షల రూపాయలను విరాళంగా సేకరించి 450 కుటుంబాలను ఆదుకుంది. ఇక ప్రణీత కు ఇలా సహాయం చేసే గుణం తన తల్లి తండ్రుల వద్ద నుండే వచ్చింది. ప్రణీత తల్లి తండ్రులు బెంగుళూరు లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడుపుతున్నారు. ఆ ఆస్పత్రి ద్వారా స్థోమత లేని వారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక సినిమాల్లో సక్సెస్ అయ్యాక ప్రణీత తన తల్లి తండ్రులతో కలిసి "ప్రణీత ఫౌండేషన్" అనే స్వచ్చంధ సంస్థను ప్రారంభించారు. ఈ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ స్వరా బెంగుళూరులో "సేవ్ గౌర్నమెంట్ స్కూల్స్" అనే ఉద్యమంలో ప్రణీత భాగస్వామిగా ఉన్నారు. అంతే కాకుండా విటార్ అనే హెల్త్ హెల్త్ టెక్ స్టార్టప్ తో పేదలకు ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా వారి ఆరోగ్య సమస్యల నివారణకు కూడా కృషి చేస్తున్నారు.


తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>