MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajedraprased-hero-93e2d6ae-98bc-49b3-a746-0541751eb606-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajedraprased-hero-93e2d6ae-98bc-49b3-a746-0541751eb606-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు ఎవరైనా ఉన్నారా..? అంటే అది కేవలం రాజేంద్రప్రసాద్ అని అంటారు చాలామంది. అయితే కేవలం రాజేంద్ర ప్రసాద్ నటుడు మాత్రమే కాదు నిర్మాత, సంగీత దర్శకుడు కూడా. చాలా సినిమాలలో హాస్య చిత్రాలతో కథానాయకుడిగా నటించి, మంచి హాస్య నటుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఈయన నటించిన అహ నా పెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు,ఏప్రిల్ 1 విడుదల,మాయలోడు వంటి సినిమాలు రాజేంద్రప్రసాద్ కు మంచి నటుడిగా, హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాయి. rajedraprased,hero,;ntr;geetha;jeevitha rajaseskhar;prasad;rajendra prasad;sampath;amarnath cave temple;krishna river;cinema;sangeetha;village;producer;diploma;september;film industry;industry;chennai;air;producer1;allu sneha;nandamuri taraka rama rao;march;babu rajendra prasadవారు లేకుంటే నేను ఇక్కడ నిలబడేవాన్ని కాదు: రాజేంద్ర ప్రసాద్వారు లేకుంటే నేను ఇక్కడ నిలబడేవాన్ని కాదు: రాజేంద్ర ప్రసాద్rajedraprased,hero,;ntr;geetha;jeevitha rajaseskhar;prasad;rajendra prasad;sampath;amarnath cave temple;krishna river;cinema;sangeetha;village;producer;diploma;september;film industry;industry;chennai;air;producer1;allu sneha;nandamuri taraka rama rao;march;babu rajendra prasadMon, 08 Mar 2021 09:43:13 GMTతెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు ఎవరైనా ఉన్నారా..? అంటే అది కేవలం రాజేంద్రప్రసాద్  అని అంటారు చాలామంది.  అయితే కేవలం రాజేంద్ర ప్రసాద్ నటుడు మాత్రమే కాదు నిర్మాత, సంగీత దర్శకుడు కూడా. చాలా సినిమాలలో హాస్య చిత్రాలతో కథానాయకుడిగా నటించి,  మంచి హాస్య నటుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఈయన నటించిన అహ నా పెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు,ఏప్రిల్ 1 విడుదల,మాయలోడు వంటి సినిమాలు రాజేంద్రప్రసాద్ కు మంచి నటుడిగా, హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాయి.


రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడ దగ్గర దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అయితే తాను బాల్యంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. అలా చిన్నప్పటినుండి ఎన్టీఆర్ ప్రభావం రాజేంద్రప్రసాద్ పై పడింది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించక ముందు తను సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశాడు..


ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ కి ఉన్న ఆసక్తిని గమనించి, ఎన్టీఆర్ చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రాజేంద్ర ప్రసాద్ ను  చేర్పించాడు. ఇక నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం బాపు దర్శకత్వంలో" స్నేహం"  అనే సినిమా.  ఇది 1977 సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది. ఆ తరువాత స్రవంతి మూవీస్ బ్యానర్ పై లేడీస్ టైలర్ సినిమా రాజేంద్రప్రసాద్ కు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిపెట్టింది..


నిజానికి స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ట్ అయిన మొట్టమొదటి చిత్రం రాజేంద్ర ప్రసాద్ నటించిన లేడీస్ టైలర్.. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన " గాలి సంపత్"   ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. " నన్ను నటుడిగా జీవితంలో నిలబెట్టిన మొదటి సినిమా లేడీస్ టైలర్. అదికూడా స్రవంతి మూవీస్ బ్యానర్ పై విడుదలైంది.. ఒకవేళ ఆ సినిమా లేకుంటే నేను ఇవాళ ఇక్కడ లేను.. అలాగే గాలి సంపత్ నా జీవితంలో ఒక ఆణిముత్యం" లాంటిది అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇటీవల గాలి సంపత్ సినిమా కూడా స్రవంతి మూవీస్ బ్యానర్ పై మార్చి 11న విడుదల కాబోతోంది..




తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>