PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jc-prabhakar-reddy5204c944-699e-4fbe-bfc9-44aee4878638-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jc-prabhakar-reddy5204c944-699e-4fbe-bfc9-44aee4878638-415x250-IndiaHerald.jpg పైగా ఈయ‌న‌పై పోటీలో ఉన్న వైసీపీ అభ్య‌ర్థి ఫ్యామిలీయే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌లో గెలిచింది. ఈ సంద‌ర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారని, ఇప్పుడు గాలి మారిందని... ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాడిప‌త్రి జ‌నాలు అంద‌రూ రావాలి ప్రభాకర్, కావాలి ప్రభాకర్ అంటున్నారని ఆయ‌న జోస్యం చెప్పారు. వీరి ఆద‌ర‌ణ చూస్తుంటే త‌మ‌కు భ‌యం వేస్తోంద‌ని.. 1952 నుంచి ఇక్కడ నిలిచామంటే అది ప్రజల్లో తమపై ఉన్న అభిమానమేనని, తమకింతటి పేరు రావడానjc prabhakar reddy;prabhakar;prabhakar reddy;jagan;chintamaneni prabhakar;panchayati;mla;air;letter;tdp;ycp;parakala prabhakar;reddyపుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌jc prabhakar reddy;prabhakar;prabhakar reddy;jagan;chintamaneni prabhakar;panchayati;mla;air;letter;tdp;ycp;parakala prabhakar;reddyMon, 08 Mar 2021 08:53:00 GMTఏపీలో జ‌రుగుతున్న ప‌ట్ట‌ణ ఎన్నిక‌ల్లో కొన్ని న‌గ‌రాల్లో జ‌రుగుతోన్న ఎన్నిక‌లే ఇప్పుడు ఆస‌క్తిగా మారాయి. అధికార‌,  ప్ర‌తిప‌క్ష పార్టీల్లో కీల‌క నేత‌లుగా ఉన్న వారు త‌మ ప‌ట్ట‌ణాల్లో ఎలాంటి రిజ‌ల్ట్ సాధిస్తార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి మున్సిప‌ల్ పోరు టీడీపీ దిగ్గ‌జ నేతలుగా ఉన్న జేసీ సోద‌రుల రాజ‌కీయ భ‌విత‌వ్యానికి అగ్నిప‌రీక్ష‌గా మారింది. ఈ పట్ట‌ణం జేసీ సోద‌రుల‌కు కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వీరు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఓడిపోయారు. ఈ సారి మాత్రం త‌మ కంచుకోటలో స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు.

చివ‌ర‌కు ఎమ్మెల్యేగా ప‌ని చేసి.. గ‌త ఎన్నికల్లో పోటీ కూడా చేయ‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇప్పుడు స్వ‌యంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల బ‌రిలో కౌన్సెల‌ర్ గా పోటీ చేస్తున్నారు. ఆయ‌న ప‌ట్ట‌ణంలో 24వ వార్డు నుంచి బ‌రిలో ఉన్నారు. పైగా ఈయ‌న‌పై పోటీలో ఉన్న వైసీపీ అభ్య‌ర్థి ఫ్యామిలీయే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌లో గెలిచింది. ఈ సంద‌ర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

నాడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారని, ఇప్పుడు గాలి మారిందని... ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాడిప‌త్రి జ‌నాలు అంద‌రూ రావాలి ప్రభాకర్, కావాలి ప్రభాకర్ అంటున్నారని ఆయ‌న జోస్యం చెప్పారు. వీరి ఆద‌ర‌ణ చూస్తుంటే త‌మ‌కు భ‌యం వేస్తోంద‌ని..  1952 నుంచి ఇక్కడ నిలిచామంటే అది ప్రజల్లో తమపై ఉన్న అభిమానమేనని, తమకింతటి పేరు రావడానికి ఈ ఊరే కారణమని స్పష్టం చేశారు.

ఇక వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ప్ర‌జ‌లు పడుతోన్న బాధ‌లను త‌మ‌తో చెప్పుకుంటున్నార‌ని... రాష్ట్రంలో టీడీపీకి అత్యధిక పంచాయతీ స్థానాలు వచ్చింది తన నియోజకవర్గంలోనే అని వెల్లడించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కచ్చితంగా తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. 


ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్...?

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..

గట్టిగా కౌంటర్ ఇచ్చిన రేణుదేశాయ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>