PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో రైతులు ఢిల్లీ కేంద్రంగా సాగిస్తున్న ఉద్య‌మానికి నేటితో 100రోజులు పూర్త‌య్యాయి. ఈ ఉద్య‌మం మొద‌లైన నాటి నుంచి అనేక నాట‌కీయ రాజ‌కీయ ప‌రిణామాలు జ‌రిగాయి. ఒక ద‌శ‌లో దేశం అట్టుడికిపోయింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న వ్య‌క్త‌మైంది. ఢిల్లీ జ‌నం భ‌యం గుప్పిట బ‌తికారు. అయితే అన్ని వ‌ర్గాల నుంచి రైతుల ఉద్య‌మానికి సానుభూతి ల‌భించింది. పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయాల‌ని చూసినా.. స‌మాజంలోని భిన్న వ‌delhi;delhi;haryana - chandigarh;narendra modi;police;january;job;november;central government;punjabమోదీ స‌ర్కారుపై రైతుల దండ‌యాత్ర‌....రైతు ఉద్య‌మానికి 100రోజులుమోదీ స‌ర్కారుపై రైతుల దండ‌యాత్ర‌....రైతు ఉద్య‌మానికి 100రోజులుdelhi;delhi;haryana - chandigarh;narendra modi;police;january;job;november;central government;punjabSun, 07 Mar 2021 11:30:19 GMTకేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో రైతులు ఢిల్లీ కేంద్రంగా సాగిస్తున్న ఉద్య‌మానికి నేటితో 100రోజులు పూర్త‌య్యాయి. ఈ ఉద్య‌మం మొద‌లైన నాటి నుంచి అనేక నాట‌కీయ రాజ‌కీయ ప‌రిణామాలు జ‌రిగాయి. ఒక ద‌శ‌లో దేశం అట్టుడికిపోయింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న వ్య‌క్త‌మైంది. ఢిల్లీ జ‌నం భ‌యం గుప్పిట బ‌తికారు. అయితే అన్ని వ‌ర్గాల నుంచి రైతుల ఉద్య‌మానికి సానుభూతి ల‌భించింది. పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయాల‌ని చూసినా.. స‌మాజంలోని భిన్న వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో ఉద్య‌మం కొన‌సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వానికి రైతు ఉద్య‌మాన్ని ఎదుర్కొవ‌డం పెద్ద స‌వాల్‌గానే మారింద‌న‌డంలో ఎలాంటి సందేహం. భార‌త్‌బంద్‌కు పార్టీల‌క‌తీతంగా నేత‌లు స్పందించ‌డం కూడా గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి.


కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న ఢిల్లీలో ప్రదర్శన కోసం పంజాబ్, హర్యానా, యుపి తదితర రాష్ట్రాలనుంచి తరలివచ్చిన వేలాది మంది రైతులు నగరంలోకి అనుమతించకపోవడంతో సింఘు, టిక్రి, ఘాజిపూర్‌ల వద్ద హైవేల పక్కన శిబిరాలు నిర్మిం చుకొని ధర్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. కేం ద్రంతో పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ .. రైతులు చట్టాల రద్దుకే పట్టుబడుతూ ఉండడంతో అవి కొలిక్కి రాకుండా పోయాయి. దేశ రాజధానిలో జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడం తో కేంద్రం సీరియస్ అయింది. అప్పటినుంచి ఉద్యమం కాస్త మందగించింది.


సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు రైతులు శనివారం కుండ్లి-మనేసర్‌-పల్వాల్‌(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌ రహదారిని దిగ్బంధించారు. ఆరు గంటలపాటు రాకపోకలు నిలిపివేశారు. రైతు సంఘాల జెండాలు, నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాము అన్నిటికీ సిద్ధం గా ఉన్నామని, డిమాండ్లను అంగీకరించేవరకూ నిరసన కొనసాగిస్తామని రాకేశ్‌ తికాయత్‌ తెలిపారు. మరోవైపు కార్పొరేట్‌, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) అధికార ప్రతినిధి దర్శన్‌పాల్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ నెల 13న రైతులు, కార్మికులు దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను దిగ్బంధిస్తారని తెలిపారు.




జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>