PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharashtra-corona10302ee6-4a74-440e-883b-9fec85d1c3d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharashtra-corona10302ee6-4a74-440e-883b-9fec85d1c3d8-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో సెకండ్ వేవ్ మొద‌లైనట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే కేసులు మాత్రం భారీగా పెరుగుతుండ‌టంతో సెకండ్‌వేవ్‌గానే ప‌రిగ‌ణిస్తూ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో నానాటికి క‌రోనా మ‌ళ్లీ విస్త‌రిస్తోంది. పెరుగుతున్న కేసులే ఇందుకు సాక్ష్యం. ప్ర‌ధానంగా ఆరు రాష్ట్రాల్లో రోజు కేసుల సంఖ్య వేల‌ల్లో న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్రం కరోనా కేసులకు సంబంధించి తాజా లెక్కలను విcorona;health;rajeev;mohandas karamchand gandhi;rajiv gandhi;doctor;central governmentనిపుణుల హెచ్చ‌రిక : క‌రోనాతో ఢిల్లీలో భ‌యాన‌క‌మే.. ఏప్రిల్‌లో పీక్స్‌లోకి మ‌హ‌మ్మారినిపుణుల హెచ్చ‌రిక : క‌రోనాతో ఢిల్లీలో భ‌యాన‌క‌మే.. ఏప్రిల్‌లో పీక్స్‌లోకి మ‌హ‌మ్మారిcorona;health;rajeev;mohandas karamchand gandhi;rajiv gandhi;doctor;central governmentSun, 07 Mar 2021 09:19:05 GMTకేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే కేసులు మాత్రం భారీగా పెరుగుతుండ‌టంతో సెకండ్‌వేవ్‌గానే ప‌రిగ‌ణిస్తూ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో నానాటికి క‌రోనా మ‌ళ్లీ విస్త‌రిస్తోంది. పెరుగుతున్న కేసులే ఇందుకు సాక్ష్యం. ప్ర‌ధానంగా ఆరు రాష్ట్రాల్లో రోజు కేసుల సంఖ్య వేల‌ల్లో న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్రం కరోనా కేసులకు సంబంధించి తాజా లెక్కలను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.


మొత్తం కేసుల్లో 80శాతానికి పైగా ఆ రాష్ట్రాల్లోనే నమోదైన‌ట్లుగా వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దేశరాజధాని ఢిల్లీలో సుమారు రెండు నెలల తరువాత కరోనా వ్యాప్తి రేటు అత్యధికంగా నమోదవుతూ వస్తోంది. ఢిల్లీలో గడచిన వారంలో యాక్టివ్ కరోనా బాధితుల సంఖ్య  పెరగడంతో పాటు ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య కూడా అదికంగానే ఉంటోంది. ఢిల్లీలో వరుసగా రెండవ రోజు కూడా కరోనా కేసుల సంఖ్య 300 దాటింది. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 53,062 మంది కరోనా టెస్టులు చేయించుకున్నారు. వీరిలో 321 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.  ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధికారి డాక్టర్ అజీత్ జైన్ మాట్లాడుతూ ఏప్రిల్ అనంతరం కరోనా కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని, మే నాటికి పీక్ స్టేజ్‌కు చేరవచ్చని అన్నారు.


ఢిల్లీలో క‌రోనా ఉధృతి ఎక్కువ‌గాను ఉంది. ఇప్ప‌ట్లో త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌న్న అభిప్రాయాన్ని వైద్య వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10 వేలకు మించి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 53 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,98,399కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 52,393కు చేరింది.




రెండో డోస్ తీసుకున్నా కరోనా!

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>