MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharyab0ce7f58-264a-49f5-91f6-77cd62f253c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharyab0ce7f58-264a-49f5-91f6-77cd62f253c4-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. acharya;chiranjeevi;ram charan teja;kumaar;shiva;ajay;kajal aggarwal;koratala siva;ram pothineni;district;cinema;police;minister;lord siva;hero;khammam;march;chitramపోలీసుల బందోబస్త్ తో ఖమ్మంలో ఆచార్య మూవీ షూటింగ్..!?పోలీసుల బందోబస్త్ తో ఖమ్మంలో ఆచార్య మూవీ షూటింగ్..!?acharya;chiranjeevi;ram charan teja;kumaar;shiva;ajay;kajal aggarwal;koratala siva;ram pothineni;district;cinema;police;minister;lord siva;hero;khammam;march;chitramSun, 07 Mar 2021 11:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరగనుంది. ఇవాళ దర్శకుడు కొరటాల శివ ఇల్లెందులో పర్యటించారు. ఇక్కడి జేకే మైన్స్ లో షూటింగ్ జరిపేందుకు నిర్ణయించారు. అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను 'ఆచార్య' చిత్రబృందం కలిసింది. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ ఇల్లెందులోని జేకే మైన్స్ లో నిర్వహించనుండడం సంతోషకరం అని పేర్కొన్నారు. చిత్రదర్శకుడు కొరటాల శివ కోరిక మేరకు చిత్రీకరణకు అన్ని అనుమతులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. షూటింగ్ కు అనుమతులే కాదు, హీరో చిరంజీవికి తన నివాసంలో ఆతిథ్యం కూడా ఏర్పాటు చేస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఇక ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మంత్రి పువ్వాడతో భేటీ అనంతరం దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ, మునుపటితో పోల్చితే ఖమ్మం జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అందుకు మంత్రి పువ్వాడను అభినందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సినిమా షూటింగ్ లకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. ఇక ఆచార్య' షూటింగ్  మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఇల్లెందులో జరగనుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


టీమిండియా ఆటగాళ్లను జాంబీలతో పోల్చిన కోచ్ రవిశాస్త్రి.. కారణం ఏంటంటే..

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>