MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news40da4985-6d8f-421e-874d-9e986af00c29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news40da4985-6d8f-421e-874d-9e986af00c29-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా రోజుల తరువాత పవన్ మళ్ళీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన " పింక్ " సినిమాకు రీమేక్ అయినప్పటికి పవన్ ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమా కథలో చాలానే మార్పులు చేశారని సమాచారం.flimy news;women;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;twitter;writer;audience;remake;letter;heroine;pink;ramajogayya sastry;chitram'వకీల్ సాబ్" నుండి హ్యాట్రిక్ అప్డేట్ ఇచ్చాడుగా..!!'వకీల్ సాబ్" నుండి హ్యాట్రిక్ అప్డేట్ ఇచ్చాడుగా..!!flimy news;women;pawan;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;twitter;writer;audience;remake;letter;heroine;pink;ramajogayya sastry;chitramSun, 07 Mar 2021 22:10:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా రోజుల తరువాత పవన్ మళ్ళీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన " పింక్ " సినిమాకు రీమేక్ అయినప్పటికి పవన్ ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమా కథలో చాలానే మార్పులు చేశారని సమాచారం.

 అయితే ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్, లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి మూడవ సాంగ్ రాబోతున్నట్లు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తెలిపారు. 

మొత్తానికి ఈ చిత్రంకు ప్రమోషన్స్ లో భాగంగా ఈ మార్చ్ నేలను మ్యూజికల్ మార్చ్ గా మార్చేశారు.ఇప్పటికే ఈ సినిమా సెకండ్ సింగిల్ “సత్యమేవ జయతే”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దీనికి ముందు వచ్చిన మగువా మగువ కూడా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు హ్యాట్రిక్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టుగా సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి అంటున్నారు. హ్యాట్రిక్ లెక్కల్లో ఉంది రాస్కోరా సాంబా అంటూ పవన్ మార్క్ డైలాగ్స్ తో ట్విటర్ వేదికగా సాంగ్ పై హింటిచ్చారు రామజోగయ్య శాస్త్రి. ఈసారి మెలోడీ టచ్ తో వీరు వస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా థమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన ఈ సాంగ్ మరో వారంలో రానున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా ఏప్రెల్ 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
" style="height: 1021px;">
  




మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే.. ఇలా చేయండి..!

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>