MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/hollywood-actor8690e772-2c42-4d24-b3a3-02312f9e37ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/hollywood-actor8690e772-2c42-4d24-b3a3-02312f9e37ed-415x250-IndiaHerald.jpgరిస్క్‌ తీసుకోవడం హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కి మహా సరదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తన చేసే చాలా సినిమాలలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తుంటారు. ఎంత రిస్క్ ఉందన్నది పట్టించుకోకుండా... ఆ సన్నివేశం సినిమాకి ఎంత ముఖ్యమైనధో ఆలోచించి దానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటి ఈ విలక్షణ నటుడి ఫన్నీ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. hollywood actor;rajani;golf;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;rajani kanth;hollywood;comedy;hero;nijam;chris morris;tom banton;maha;tom hooperటామ్ క్రూజ్‌ నకిలీ వీడియోలను తయారు చేసిన వ్యక్తి...!టామ్ క్రూజ్‌ నకిలీ వీడియోలను తయారు చేసిన వ్యక్తి...!hollywood actor;rajani;golf;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;rajani kanth;hollywood;comedy;hero;nijam;chris morris;tom banton;maha;tom hooperSun, 07 Mar 2021 11:00:00 GMTమహా సరదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తన చేసే చాలా సినిమాలలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తుంటారు. ఎంత రిస్క్ ఉందన్నది పట్టించుకోకుండా... ఆ సన్నివేశం సినిమాకి ఎంత ముఖ్యమైనధో ఆలోచించి దానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటి ఈ విలక్షణ నటుడి ఫన్నీ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. అయితే మొదట్లో ఈ వీడియోలు చూసిన వారందరూ అదేంటి ఈ స్టన్నింగ్ హీరో క్రూజ్ మరి ఇంత కామెడీ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఆ వీడియోలను బాగా పరిశీలించిన ఆయన అభిమానులు అసలు నిజం తెలుసుకున్నారు.

ఆ వీడియోలు ఫేక్ వీడియోలు అని ఆ వ్యక్తి టామ్ క్రూజ్ కాదని కనిపెట్టేశారు. బెల్జియం దేశానికి చెందిన క్రిస్ యున్ అనే వ్యక్తి టెక్నాలజీని ఉపయోగించి టామ్ క్రూజ్ రూపంతో ఉన్న నకిలీ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంకేముంది ఆ వీడియో నిజంగా టామ్ క్రూజ్ చేసినవని వైరల్ గా మారాయి. మొదట వీటిని టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు... అయితే వాస్తవానికి  టామ్ క్రూజ్ కు టిక్ టాక్ అకౌంట్ లేక పోవడంతో అసలు విషయం బయట పడింది. అవి ఫేక్ వీడియోలు అని తెలిసింది.

క్రిస్ యున్ @deeptomcruise పేరుతో ఉన్న హ్యాండిల్‌లో ఈ వీడియోలను షేర్ చేశాడు. ఇక ఆ వీడియోలో... టామ్ క్రూజ్ మ్యూజిక్ ప్లే  చేస్తున్నట్లు, ఒక తరగతి గదిలో మాట్లాడుతున్నట్లు, టామ్ క్రూజ్ గోల్ఫ్ ఆడుతున్నట్లు మూడు ఫేక్ వీడియోలు ఉన్నాయి. ఇవి ఫేక్ వీడియోలు అని తెలుసుకున్న అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆగ్రహాన్ని కనబరుస్తున్నారు. టెక్నాలజీ అన్నది మానవాళి అభివృద్ధి కొరకు ఉపయోగించాలి తప్ప, ఇలా అర్థం లేని పనులు చేయడం వ్యర్థం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై హాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.


జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>