PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guttilo-rangamloki-digina-jc-pavan-kumarcf6b4882-a953-41b9-9e01-c9a498ab2792-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guttilo-rangamloki-digina-jc-pavan-kumarcf6b4882-a953-41b9-9e01-c9a498ab2792-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో తెలుగుదేశం అనంతపురం పార్లమెంట్ ఇంచార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి నిన్న 18వ వార్డు కౌన్సిలర్ టీడీపీ అభ్యర్థి ప్రవీణ చౌదరి వార్డులో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జేసీ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మన తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులను సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను పవన్ కుమార్ అభ్యర్ధించారు. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తే వార్డుap municipal elections;pawan;kumaar;choudary actor;editor mohan;pawan kumar;jagan;andhra pradesh;district;telugu;parliment;cycle;tdp;sv mohan reddy;reddyపుర పోరు : గుత్తిలో రంగంలోకి దిగిన జేసీ పవన్ !పుర పోరు : గుత్తిలో రంగంలోకి దిగిన జేసీ పవన్ !ap municipal elections;pawan;kumaar;choudary actor;editor mohan;pawan kumar;jagan;andhra pradesh;district;telugu;parliment;cycle;tdp;sv mohan reddy;reddySun, 07 Mar 2021 09:00:00 GMTఅనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో తెలుగుదేశం అనంతపురం పార్లమెంట్ ఇంచార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి నిన్న 18వ వార్డు కౌన్సిలర్ టీడీపీ అభ్యర్థి  ప్రవీణ చౌదరి తరపున ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జేసీ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులను సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను పవన్ కుమార్ అభ్యర్ధించారు. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తే వార్డులలో  డ్రైనేజీలు ,తాగునీరు ,వీధిలైట్లు , శానిటేషన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. 

అలాగే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని  వార్డు ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఒక చేత్తో సంక్షేమ పథకాలు అందిస్తూ రెండు చేతులతో లాక్కుంటున్నారని, అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. మా కార్యకర్తలలో ఆత్మస్థైర్యం నింపడానికి ఈ ప్రచారంలో పాల్గొని వాళ్ల వెంట ఎప్పటికీ ఉంటామని పవన్ అన్నారు. ఇక గుత్తి మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా అందులో ఏకగ్రీవాలు - 6 అయ్యాయి. అవి అన్నీ వైసీపీకే అయ్యాయి. 

ఇక ఎన్నికలు జరగాల్సిన వార్డులు 19 ఉన్నాయి.  ఈసారి చైర్మన్ పీఠం జనరల్ మహిళలకు కేటాయించడంతో చాలామంది నాయకులు ఇప్పటికే తమ భార్యలను రంగంలోకి దింపారు.. దీంతో ప్రధానంగా చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొని ఉంది. కొంత మంది అభ్యర్థులు తమ పోటీదారులు ఓట్లు చీల్చి వారిని ఓడించేందుకు గాను తమ మద్దతుతో కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వయంగా వారే డిపాజిట్లు చెల్లించి మరీ తమ మద్దతుదారులను తమ వార్డులోని పోటీ చేయించడం ఆసక్తికరంగా మారింది.




ఆ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడ్డంగా బుక్ అయిన టీటీడీ ఉద్యోగులు

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>