MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushkaefdabbd9-2500-4b9d-bc45-766b43e26790-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushkaefdabbd9-2500-4b9d-bc45-766b43e26790-415x250-IndiaHerald.jpgఅనుష్క శెట్టి. సీనియర్ మోస్ట్ హీరోయిన్. బాహుబలి మూవీతో ఆమె బాలీవుడ్ లోనూ జెండా ఎగరేసింది. టాలెంటెడ్ ఆర్టిస్టుగా ముద్ర పడిన అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వరసగా చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోలతో సమానంగా ఆమె ఇమేజ్ ని సంపాందించుకుంది. అనుష్క నంబర్ వన్ హీరోయిన్ గా ఇండస్ట్రీని చాన్నాళ్ళు ఏలింది. anushka;anoushka;anushka;jeevitha rajaseskhar;naveen polishetty;bollywood;cinema;bahubali;nishabdham;hero;heroine;nijam;uv creations;v;nishabdamఅనుష్క షాకింగ్ డెసిషన్... ఆ యంగ్ హీరోతో...?అనుష్క షాకింగ్ డెసిషన్... ఆ యంగ్ హీరోతో...?anushka;anoushka;anushka;jeevitha rajaseskhar;naveen polishetty;bollywood;cinema;bahubali;nishabdham;hero;heroine;nijam;uv creations;v;nishabdamSun, 07 Mar 2021 11:18:53 GMTఅనుష్క శెట్టి. సీనియర్ మోస్ట్ హీరోయిన్. బాహుబలి మూవీతో ఆమె బాలీవుడ్ లోనూ జెండా ఎగరేసింది. టాలెంటెడ్ ఆర్టిస్టుగా ముద్ర పడిన అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వరసగా చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోలతో సమానంగా ఆమె ఇమేజ్ ని సంపాందించుకుంది. అనుష్క నంబర్ వన్ హీరోయిన్ గా ఇండస్ట్రీని చాన్నాళ్ళు ఏలింది.

అటువంటి ఆమె చాన్నాళ్ళుగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిశ్శబ్దం మూవీ తరువాత అనుష్క ఏమీ మాట్లాడకుండా ఫుల్ సైలెంట్ అయిపోయింది. ఆమె సినిమాలు చేస్తుందా లేదా అన్నది పెద్ద డౌట్. అంతే కాదు, ఆమె వ్యక్తిగత జీవితం మీద కూడా చాలానే ప్రచారం జరిగింది. ఆమె పెళ్ళి చేసుకుంటుంది, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అని కూడా టాక్ నడిచింది.

అయితే అనుష్క నుంచి నో రియాక్షన్. ఆమె అన్నీ మౌనంగా వింటూ వచ్చింది. కానీ సడెన్ గా అనుష్క మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది అంటున్నారు. అది కూడా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో జత కడుతోందని అంటున్నారు. నిజంగా ఈ వార్త చాలా ఇంటెరెస్టింగ్ అని చెప్పాలి. అనుష్క వంటి సీనియర్ హీరోయిన్ ఒక యంగ్ హీరోతో నటించడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఆ మూవీ మీద అంచనాలు చాలా పెరిగిపోతున్నాయి.

ఇక మరో అప్ డేట్ ఏంటి అంటే ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నవీన్ పోలిశెట్టి ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అంతే కాదు ఆయన నటించిన జాతి రత్నాలు మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ తరువాత నవీన్ ఇంకా ముందుకు సాగుతాడు అన్న అంచనలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆయన ఏకంగా అనుష్క పక్కన నటిస్తే మాత్రం అది సూపర్ హిట్టే అంటున్నారు.




జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>