Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudha96da2722-b5b8-4cd5-a915-7f389b14bd21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudha96da2722-b5b8-4cd5-a915-7f389b14bd21-415x250-IndiaHerald.jpgసుధ ఒక ప్రముఖ సిని నటి.500 కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. గ్యాంగ్ లీడర్,చాలా బాగుంది, అతడు, దూకుడు, బాద్ షా లాంటి సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించారు. తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత్, విశాల్ ఇటువంటి హీరోలందరికీ తల్లి పాత్రలో చేసారు. అంతేకాకుండా సుధ అమ్మ,అక్క వదిన, ఇలా ఏ పాత్ర అయినా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయే నటి. సీనియర్ యాక్టర్ చిరు,నాగార్జున నుంచి నేటితరం యాక్టర్స్ బన్నీ, చైతు అందరితో నటించిన అనుభవం సుధ ది. అయితే ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లsudha;chiranjeevi;mahesh;ntr;ram charan teja;naresh;nagarjuna akkineni;susheela;ajith kumar;akkineni venkat;allari naresh;allu arjun;editor mohan;jr ntr;nageshwara rao akkineni;ram pothineni;sudha;surya sivakumar;venkat;vishal krishna;cinema;telugu;smart phone;tamil;youtube;you tube;husband;hero;nandamuri taraka rama rao;arjun 1;gang leader;ajit pawar;leader;allari;major chandrakanth;annayya;chitramసీనియర్ నటి పై ఆ హీరో ఫాన్స్ ఫైర్..?సీనియర్ నటి పై ఆ హీరో ఫాన్స్ ఫైర్..?sudha;chiranjeevi;mahesh;ntr;ram charan teja;naresh;nagarjuna akkineni;susheela;ajith kumar;akkineni venkat;allari naresh;allu arjun;editor mohan;jr ntr;nageshwara rao akkineni;ram pothineni;sudha;surya sivakumar;venkat;vishal krishna;cinema;telugu;smart phone;tamil;youtube;you tube;husband;hero;nandamuri taraka rama rao;arjun 1;gang leader;ajit pawar;leader;allari;major chandrakanth;annayya;chitramSun, 07 Mar 2021 01:00:00 GMTసుధ ఒక ప్రముఖ సిని నటి.500 కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. గ్యాంగ్ లీడర్,చాలా బాగుంది, అతడు, దూకుడు, బాద్ షా లాంటి సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించారు. తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత్, విశాల్ ఇటువంటి హీరోలందరికీ  తల్లి పాత్రలో చేసారు. అంతేకాకుండా సుధ అమ్మ,అక్క వదిన, ఇలా ఏ పాత్ర అయినా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయే నటి. సీనియర్ యాక్టర్ చిరు,నాగార్జున నుంచి నేటితరం యాక్టర్స్ బన్నీ, చైతు అందరితో నటించిన అనుభవం సుధ ది. అయితే ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు.


రామ్ చరణ్, మనోజ్, అల్లు అర్జున్, అల్లరి నరేష్ ఇలా అందర్నీ చిన్నప్పటి నుంచి చూశానని, వారంతా తనతో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పింది. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో మమ్మీ అంటూ మనోజ్ గట్టిగా అరిచాడని తెలిపింది. మేజర్ చంద్రకాంత్ సమయం నుంచి మనోజ్ తనను మమ్మీ అనే పిలుస్తాడని చెప్పుకొచ్చింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . అదే చిత్రంలో సుధ మోహన్ బాబు అక్కగా నటించారు. చిరంజీవితో సుధ ప్రయాణం గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ముందు నుండి ఉంది . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అనేక సినిమాల్లో సుధ నటించారు. వాటిల్లో ఆమెలో సుధ పోషించిన పాత్రకి అభినందించకుండా ఉండలేం, కోడల్ని హింసిస్తున్న భర్త కోటాశ్రీనివాసరావుని చంపే సీన్లో సుధలోని మరోయాంగిల్ నటన చూడొచ్చు.



అప్పటి వరకు సౌమ్యమైన పాత్రలు పోషించిన సుధ , ఆ పాత్రతో తనలోని రౌద్రాన్ని చూడొచ్చు. చిరంజీవి, నాగార్జున, బాలయ్యతో చాలా క్లోజ్ అని వారితో చాలా సినిమాలు చేయడంతో వారి కుటుంబాలతో కూడా కలిసి పోయాయని చెప్పుకొచ్చింది. అందరి కంటే నాగార్జున ఫ్యామిలీతోనే తనకు ఎక్కువ అనుబంధం అని తెలిపింది. నాగార్జున అక్క సుశీల,  అన్నయ్య అక్కినేని వెంకట్ బాగా తెలుసని, సుశీలతో ఫోన్‌లో చాలా సేపు ఫోన్ మాట్లాడతుంటానని పేర్కొంది.వీటన్నింటితో పాటు శ్రీమంతుడు సినిమాలో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనే విషయాన్ని శేర్ చేసుకున్నారు.తాను ఓ క్యారెక్టర్ చేస్తే అందరూ గుర్తించాలని, అందరికి గుర్తుండిపోయే పాత్రలే చేస్తానని చెప్పుకొచ్చింది.


తన పాత్ర నచ్చకపోతే ఆ క్యారెక్టర్ చేయనని ఖరాఖండిగా చెప్పేసింది. అందులో భాగంగానే శ్రీమంతుడు సినిమాను వదులుకున్నానని కూడా తెలిపింది.శ్రీమంతుడు సినిమాలో తన పాత్ర రెండు రోజులే షూటింగ్,పాత్ర నిడివి రెండు నిమిషాలే ఉంటుందని చెప్పారు. అలాంటప్పుడు తానెందుక ఆ పాత్ర చేయాలని, అందుకే వదులుకున్నట్లు పేర్కొంది. మనసు చంపుకుని తాను ఏ పాత్ర చేసినా అది ప్రజలు గుర్తించే విధంగా ఉండాలనే కోరుకుంటానని తెలిపింది. ఊరికే దిష్టిబొమ్మలా నిల్చునే పాత్రలు తాను ఒప్పుకోనని స్పష్టం చేసింది.సుధ చేసిన కామెంట్స్ పట్ల కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మరికొందరు మహేష్ బాబు ఫాన్స్ మాత్రం నెగటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడంటే అవకాశాలున్నాయి కాబట్టి, ఇంత తలపొగరుగా మాట్లాడుతున్నావ్ లేకపోతే ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేసేదానివి అని కొందరు కామెంట్ చేస్తే , ఏ పాత్ర చేయాలి, ఏది చేయకూడదు అనేది ఆమె ఇష్టం అని మరికొందరు సుధకి సపోర్ట్గా కామెంట్ చేస్తున్నారు.


వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>