Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/team-india92234f8f-a597-40ac-b139-fcbf3127c144-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/team-india92234f8f-a597-40ac-b139-fcbf3127c144-415x250-IndiaHerald.jpgన్న ఆసీస్‌పై, నేడు ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయాలను సాధించి ఔరా అనిపించింది. సగర్వంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోకి టాప్‌ప్లేస్‌లో అడుగుపెట్టింది. దీనిపై భారత జట్టు కోచ్ రవిశాస్త్రి స్పదించారు. తమ కుర్రాళ్లు జాంబీల్లా మారారని, కఠిన పరిస్థితుల్లో కూడా ఎక్కడా బెదరకుండా, ఎలాంటి బెరుకూ లేకుండా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. టెస్ట్ చాంపియన్ షిప్ గురించి ఆలోచించకుండా..team india;rani;tiru;audi;rishabh pant;winner;ravi shastri;nijamటీమిండియా ఆటగాళ్లను జాంబీలతో పోల్చిన కోచ్ రవిశాస్త్రి.. కారణం ఏంటంటే..టీమిండియా ఆటగాళ్లను జాంబీలతో పోల్చిన కోచ్ రవిశాస్త్రి.. కారణం ఏంటంటే..team india;rani;tiru;audi;rishabh pant;winner;ravi shastri;nijamSun, 07 Mar 2021 11:30:56 GMTఇంటర్నెట్ డెస్క్: నిన్న ఆసీస్‌పై, నేడు ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయాలను సాధించి ఔరా అనిపించింది. సగర్వంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోకి టాప్‌ప్లేస్‌లో అడుగుపెట్టింది. దీనిపై భారత జట్టు కోచ్ రవిశాస్త్రి స్పదించారు. తమ కుర్రాళ్లు జాంబీల్లా మారారని, కఠిన పరిస్థితుల్లో కూడా ఎక్కడా బెదరకుండా, ఎలాంటి బెరుకూ లేకుండా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. టెస్ట్ చాంపియన్ షిప్ గురించి ఆలోచించకుండా కేవలం ఈ సిరీస్‌పైనే దృష్టి సారించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని వెల్లడించారు.

‘కుర్రాళ్లు సిరీస్‌పై మాత్రమే ఫోకస్ చేశారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ గురించి ఆలోచన కూడా చేయలేదు. టెస్ట్ చాంపియన్ షిప్ రేసులో మేం అగ్రస్థానంలో ఉండగా.. ఛాంపియన్‌షిప్‌ రూల్స్ మార్చారు. అయినా పట్టించుకోలేదు. సిరీస్‌పై మాత్రమే దృష్టి సారించాం. అయితే మరికొంత విశ్రాంతి లభించి ఉంటే చెన్నైలో తొలి టెస్టులో ఫలితం మారి ఉండేది. విశ్రాంతి తగ్గి కుర్రాళ్లు జాంబీల్లా మారారు. గెలిచేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ కుదరలేద’ని రవిశాస్త్రి పేర్కొన్నారు.

ఒత్తిడి చిత్తు చేస్తున్నా రిషబ్ పంత్‌, వాషింగ్టన్ సుందర్‌ పోరాడిన తీరు అద్భుతమని, జట్టు స్కోరు 360కి చేర్చడం నిజంగా ప్రశంసించాల్సిన విషయమని అన్నారు. జట్టు సమష్ఠి పోరాటంతో సిరీస్‌ను చేసుకోవడం, అది కూడా 3-1తో సిరీస్‌‌ను కైవసం చేసుకోవడం నిజంగా గర్వంగా ఉందని పేర్కొన్నారు. సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు కూడా సమాన అవకాశాలు వచ్చాయని, వాటిని అందిపుచ్చుకొని ఉంటే ఆ జట్టు కనీస పోరాటమైనా చేసి ఉండేదని అన్నారు. ‘మా జట్టు ఓడిపోవడానికి ఇష్టపడటం లేదు. దీనికి ఆసీస్‌తో సిరీసే ఉదాహరణ.

ఇక సెంచరీతో రాణించిన పంత్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. సొంతగడ్డపై బంతి తిరుగుతున్నప్పుడు ఆరో స్థానంలో వచ్చి బ్యాటింగ్‌ చేయడం సులువు కాదదు. గత నాలుగు నెలలుగా అతడు విపరీతంగా శ్రమించాడు. ఇప్పుడు దానికి ఫలితం కనిపిస్తోంది. నిన్న ఆడిన ఇన్నింగ్స్‌ అత్యుత్తమైందిగా చెప్పవచ్చు. భారత్‌లో ఆరో స్థానంలో వచ్చి అలా ఆడటం తేలిక కాదు. ఆటను గౌరవించాలని, బరువు తగ్గి కీపింగ్‌ మెరుగుపర్చుకోవాలని సూచించాం. అతడి ప్రతిభ మాకు తెలుసు. అతడు నిజమైన మ్యాచ్‌ విజేత. సరైన రీతిలోనే స్పందించాడం’టూ శాస్త్రి పేర్కొన్నారు.


జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>