PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu-politics82400e20-f264-47a6-9314-b9e43c7e2658-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu-politics82400e20-f264-47a6-9314-b9e43c7e2658-415x250-IndiaHerald.jpgచెన్నైలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రముఖ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రచారంలో పాల్గొంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిన్న కొళత్తూరులో ఎన్నికల ప్రచారంలో కమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ డీఎంకేపై కమల్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మక్కల్‌ నీది మయ్యం నిజాయితీ పరుల గుడారంగా మారినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, మార్పు లక్ష్యంగా తనతో చేతులు కలిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ధీమా వ్యక్తంtamilanadu politics;view;amala akkineni;kamal hassan;bharatiya janata party;congress;tamilnadu;central government;butter;partyడీఎంకే పార్టీ పై కమల్ ఆగ్రహం..డీఎంకే పార్టీ పై కమల్ ఆగ్రహం..tamilanadu politics;view;amala akkineni;kamal hassan;bharatiya janata party;congress;tamilnadu;central government;butter;partySun, 07 Mar 2021 12:13:28 GMTపార్టీ అధినేత కమల్ హాసన్ ప్రచారంలో పాల్గొంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిన్న కొళత్తూరులో ఎన్నికల ప్రచారంలో కమల్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ డీఎంకేపై కమల్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మక్కల్‌ నీది మయ్యం నిజాయితీ పరుల గుడారంగా మారినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, మార్పు లక్ష్యంగా తనతో చేతులు కలిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలు దొందుదొందే అని, ఈ రెండు పార్టీలు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని ఆరోపించారు.


ప్రజలు జీవన స్థితి పెంపు, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే మార్పు పయనంలో ఉన్న తనను కొనేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని కమల్ అన్నారు. కమల్‌ నాట్‌ ఫర్‌సేల్, తమిళనాడు నాట్‌ ఫర్‌ సేల్‌ అంటూ ఓటు కూడా నాట్‌ ఫర్‌ సేల్‌ అని అవినీతిపరులకు బుద్ధి చెప్పే రీతిలో తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.డీఎంకే వాళ్లే బీజేపీ వ్యూహాలను తమిళనాడులో రహస్యంగా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ పార్టీ రంగు ప్రస్తుతం బయటపడుతోందని, మరి కొద్ది రోజుల్లో బీజేపీతో వారికి ఉన్న రహస్య ఒప్పందం బయటపడడం ఖాయం అని వ్యాఖ్యానించారు. అందుకే సీట్ల పంపకాల పేరిట కాంగ్రెస్‌ను కూటమి నుంచి సాగనంపే ప్రయత్నాల్లో డీఎంకే ఉందని మండిపడ్డారు.


ఈ ఎన్నికల్లో కూడా ఎక్కడా కాంగ్రెస్ పార్టీ జాడ కనిపించలేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని నామా రూపాలు లేకుండా చేసేందుకు కేంద్రం, తాజాగా తమిళనాడులో డీఎంకే ద్వారా వ్యూహాలకు రచిస్తుందని పేర్కొన్నారు. డీఎంకే కుట్రలను పరిగణించి కాంగ్రెస్‌ మేల్కుంటే మంచిదని, లేని పక్షంలో తీవ్ర నష్టం ఆ పారీ్టకే అని హెచ్చరించారు. మక్కల్‌ నీది మయ్యం ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయం అని, అన్నాడీఎంకే అసంతృప్తి వాదులు, డీఎంకే వ్యతిరేకులు ఎన్నికల సమయానికి తన వెన్నంటి పెద్ద ఎత్తున రావడం ఖాయమని అధికారాన్ని మేమే సొంతం చేసుకుంటామని కమల్ ధీమాను వ్యక్తం చేశారు.


2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>