Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/yesiditi3b259591-638b-4b79-be65-d15f42e38a81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/yesiditi3b259591-638b-4b79-be65-d15f42e38a81-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం చాలామంది ఎసిడిటీ తో బాధపడుతున్నారు. ఎసిడిటీ నిర్మూలించడానికి తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల ఎసిడిటీని నివారించవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం... yesiditi;nithya new;prakrutiవేసవికాలంలో ఎసిడిటీ రాకుండా ఉండాలంటే..? ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి...వేసవికాలంలో ఎసిడిటీ రాకుండా ఉండాలంటే..? ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి...yesiditi;nithya new;prakrutiSun, 07 Mar 2021 07:00:00 GMT
 వేసవికాలంలో పుచ్చ కాయలు తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. పుచ్చకాయలో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఏర్పడే ఎసిడిటీని నివారిస్తాయి. అందుకే పుచ్చ కాయలను బాగా తినాలి. అంతేకాకుండా ఈ పండు తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే శరీరంలో ఏర్పడే డీహైడ్రేట్ సమస్యను నిర్మూలిస్తుంది. పుచ్చకాయ తో పాటు బొప్పాయి,యాపిల్ వంటి వాటిని కూడా తీసుకోవడం మంచిది. ఇవన్నీ శరీరములో ఎసిడిటీ  రాకుండా కాపాడతాయి.                                                        

 వేసవికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరినీళ్లు ప్రకృతి సిద్ధమైన డ్రింక్. ఇందులో క్లీనింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే  కొబ్బరి నీళ్లు తాగడం వల్ల  శరీరంలోని  విషపదార్థాలను బయటకు పంపుతాయి. కొబ్బరి  నీళ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు నిత్యం అడగడం వల్ల జీర్ణక్రియ  సక్రమంగా జరుగుతుంది.

 చల్లటి పాలు తాగడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గుతుంది. కడుపులో  ఏర్పడి యాసిడ్లను పాలు పీల్చుకుంటాయి. దీంతో కడుపులో మంట తగ్గుతుంది. అయితే పాలలో పంచదార వేసుకోకుండా తాగాలి.

 అరటిపండు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు.కానీ అరటిపండు  తినడం వల్ల ఎసిడిటికి కూడా మంచి ఔషధం లా పనిచేస్తుంది. పండ్లలో ఉండే పొటాషియం కడుపు అంచుల్లో మ్యూకస్ ను ఉత్పత్తి  చేసి శరీరంలోని పీహెచ్ ప్రమాణాన్ని తగ్గి స్తుంది. అరటి పండులో కూడా  పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవిలో అరటిపండు తినడం వల్ల ఎసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది.


ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య

వై.ఎస్‌. శాంతి అక్షింతల గురించి ఉండవల్లి చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ..?

పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>