EditorialParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/privatization-requirement-in-india16574f7e-d84e-4842-8042-ac9090f3fec7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/privatization-requirement-in-india16574f7e-d84e-4842-8042-ac9090f3fec7-415x250-IndiaHerald.jpgప్రయివేటీకరణ ఎందుకు వద్దు? ఏపిలో ఇప్పటికి మనకు తెలిసే బోలెడన్ని ప్రభుత్వ సంస్థలు ప్రవేటీకరణకు గురయ్యాయి. కొన్ని మాయ మయ్యాయి కూడా! ఉదాహరణకు ఐడిపిఎల్, హెచ్ఎంటి, ఆల్విన్ ఇలా ఎన్నింటినో చెప్పచ్చు. అయితే పబ్లిక్ సెక్టార్లో ఉన్న సంస్థల నిర్వహణ తీరు అన్యాయంగా మారిపోయింది. ఉదాహరణకు భారతీయ పబ్లిక్ సెక్టార్ జెయింట్ "స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా" లో ఒక సాధారణ వినియోగదారుని అడిగి చూడండి. వారు ఆ సంస్థ లీలలు కథలు కథలుగా చెపుతారు. ఎస్బిఐ దాని లీలలు గురించి పుంఖానుపుంఖంగా వార్తలు వస్తూనే ఉంటాయి.privatization requirement in india;deva;maya;tara;india;sbi;vishakapatnam;bus;lic;air;air india;mahaఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?privatization requirement in india;deva;maya;tara;india;sbi;vishakapatnam;bus;lic;air;air india;mahaSun, 07 Mar 2021 07:30:00 GMTమాయ మయ్యాయి కూడా! ఉదాహరణకు ఐడిపిఎల్, హెచ్ఎంటి, ఆల్విన్ ఇలా ఎన్నింటినో చెప్పచ్చు.

అయితే పబ్లిక్ సెక్టార్లో ఉన్న సంస్థల నిర్వహణ తీరు అన్యాయంగా మారిపోయింది. ఉదాహరణకు భారతీయ పబ్లిక్ సెక్టార్ జెయింట్ "స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా" లో ఒక సాధారణ వినియోగదారుని అడిగి చూడండి. వారు ఆ సంస్థ లీలలు కథలు కథలుగా చెపుతారు. ఎస్బిఐ దాని లీలలు గురించి పుంఖానుపుంఖంగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయినా దాని మేనేజ్మెంట్ కు చీమకుట్టినట్లైనా ఉండదు. అలాగే ఎల్ఐసి - లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - వినియోగదారుల సేవలు అర్ధ్వాన్నం.



మన "బిఎస్ఎన్ఎల్'" చూడండి ఏ గ్రామీణ ప్రాంతాల్లోనో, ఈశాన్య రాష్ట్రాల్లోనో, సుదూర ప్రాంతాల్లోనో, పర్వత ప్రాంతాల్లోనో దాని సేవలు ఉన్నాయేమో? అంతే కాదు. సాధారణ వినియోగదారుడెవరూ కూడా ఈ ప్రభుత్వ సంస్థ సేవలు అందిపుచ్చుకునేలా లేరు. కాకులు దూరని కారడవుల్లోనో చీమలు దూరని చిట్టడవుల్లోనో దాని అవసరం కనిపించవచ్చు కానీ నాగరిక నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో దాని నెవరు పట్టించు కోరు. ఆ సంస్థ డిజాస్టరస్ స్టేట్ లో కొట్టుకుంటుంది.



మహానగరాల మధ్యనో, సుదూర  ప్రయాణాలకైతేనో - ప్రయివేట్ బస్సులో ప్రయాణం సుఖంగా ఉంటుంది. మన పైగా ప్రయివేట్ బస్ సర్వీసుల్లో సేవలు అద్భుతం. ఆర్టీసీల పని తీరు నరకప్రాయం, మనం ప్రభుత్వసంస్థలు ఆర్టీసీలతో పోల్చితే.


అలాగే ఎయిర్ ఇండియా తీరు చూడండి. దాన్ని దేవుడు కూడా బాగు చేయలేడు. పోనీ, నష్టం వచ్చినా కనీసం ప్రయాణికులైన ప్రయోజనం పొందుతున్నారా? అంటే అదీ లేదు. క్రమశిక్షణ లేని ఉద్యోగులతో నిరంతరం అవస్థలే! రూల్స్ పేరు చెప్పి వినియోగదారులని వేదించుకు తింటుంటారు.


ఇక ఇండియా పోస్ట్ అంటే పోస్టాఫీస్ లు - సేవలు మహా ఘోరం. ప్రయివేట్ కొరియర్లు వచ్చాక వీటిని కొందరు పట్టించు కోవటం మానేశారు. ఇప్పుడు వినియోగ దారుడు విశాఖ స్టీల్, టాటా స్టీల్ రెంటిలో దేన్ని ఎంచుకుంటాడో ? ఆలోచించండి? స్టీల్ కొనటానికి దేన్నీ ఎంపిక చేసు కుంటాడు? ఒక రూపాయి ఎక్కువైనా టాటా స్టీల్ కొంటాడు కారణం దాని క్వాలిటీపై నమ్మకం సేవలపై విశ్వాసం. సామాన్యుడు ఏ టాటా స్టీల్ కోసమో? ఏ జె ఎస్ డబ్లుయు  - స్టీల్ కోసమో వెతుకుతాడు తప్ప విశాఖ స్టీల్ ముఖం చూడడు. ఎందుకంటే అక్కడ వినియోగదారుల సేవలు అంతంత మాత్రమే.



ఇప్పుడు చెప్పండి మన విశాఖ ఉక్కు - ప్రయివేటైజ్ అయితే నష్టమేమిటి? ప్రజా సంక్షేమం చూడాల్సిన  ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి? చేస్తే ఎవడికి లాభం? రాజకీయ నాయకులకు మంత్రిత్వ శాఖలో బాధ్యతల పేరుతొ లాభాలు (లంచాలు) దండుకుంటారు. ప్రభుత్వ అధికార వర్గాలకు ఉద్యోగ ప్రయోజనాలు ఉన్నత పదవులు పెరుగుతాయి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల కంటే, ప్రయివేట్ లో వాటి పని తీరు దేశం మొత్తం మీద అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు ఇవన్నీ ప్రవైట్ పరం చేయటం ప్రయోజనకరం.



అయితే సరైన చట్టాలను రూపొందించి అన్ని ప్రయివేట్ వ్యవస్థలను "రెగ్యులేటరీ ఆధారిటీస్" నియంత్రణలో అన్ని ప్రయివేట్ వ్యవస్థలను రెగ్యులేట్ చేస్తూ నిర్వహించటం అవసరం. అదేమీ అంత కష్టం కాదు.


 


పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య

వై.ఎస్‌. శాంతి అక్షింతల గురించి ఉండవల్లి చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ..?

పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>