MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya-geetha-arts0a21249f-d7a0-4b7e-9e2a-205f11f697d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya-geetha-arts0a21249f-d7a0-4b7e-9e2a-205f11f697d4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ఇప్పుడు కొత్త యుగం మొదలైందనే చెప్పాలి. సీనియర్ డైరెక్టర్ లకు పూటిగా వారి అసిస్టెంట్లు, అలాగే కొత్త దర్శకులు వచ్చి తమ ప్రతిభని నిరూపించుకొని చాలా తక్కువ కాలంలోనే పెద్ద స్టార్ డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఇక నిర్మాతలు కూడా తమ లాభాల కోసం కొత్త దర్శకులు, కాస్త టాలెంట్ ఉన్న వారికోసం వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. సినిమా విడుదలైన తరువాత ఏ మాత్రం టాలెంట్ ఉందని అనిపించినా.. పిలిచి మరీ అడ్వాన్స్ లు చేతిలో పెడుతున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దర్శకుడిలో విషయం ఉందని తెలిస్తే వారిపై దృష్టి పెడుతుKarthikeya geetha arts;allu arjun;karthikeya;kartikeya;kaushik;cinema;industry;director;massచావు కబురు చల్లగా డైరెక్టర్ పై దృష్టి పెడుతున్న ఇండస్ట్రీ....చావు కబురు చల్లగా డైరెక్టర్ పై దృష్టి పెడుతున్న ఇండస్ట్రీ....Karthikeya geetha arts;allu arjun;karthikeya;kartikeya;kaushik;cinema;industry;director;massSun, 07 Mar 2021 20:30:00 GMTడైరెక్టర్ లకు పూటిగా వారి అసిస్టెంట్లు, అలాగే కొత్త దర్శకులు వచ్చి తమ ప్రతిభని నిరూపించుకొని చాలా తక్కువ కాలంలోనే పెద్ద స్టార్ డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఇక నిర్మాతలు కూడా తమ లాభాల కోసం కొత్త దర్శకులు, కాస్త టాలెంట్ ఉన్న వారికోసం వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. సినిమా విడుదలైన తరువాత ఏ మాత్రం టాలెంట్ ఉందని అనిపించినా.. పిలిచి మరీ అడ్వాన్స్ లు చేతిలో పెడుతున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దర్శకుడిలో విషయం ఉందని తెలిస్తే వారిపై దృష్టి పెడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజై ఆకట్టుకునే విధంగా ఉంటే వెంటనే లాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త డైరెక్టర్ పై కూడా దృష్టి పడి అతని కోసం పోటీ పడుతూ ముందుగానే కర్చీఫ్ లు వేస్తున్నారు నిర్మాతలు.గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు 'చావు కబురు చల్లగా' అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.


సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి జనాలను ఆకట్టుకుంటూ అంచనాలని పెంచేస్తూ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది...ఈ సినిమా టీజర్ వైవిధ్యంగా ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది సినిమాపై ఆసక్తిని మరింత పెంచిందనే చెప్పాలి.దీంతో దర్శకుడు ఎవరని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ట్రైలర్ చూసి కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి గురించి ఎంక్వయిరీలు చేసి అతనితో సినిమాలు చెయ్యాలని ఆరాటపడుతున్నారు నిర్మాతలు. ఇక "చావు కబురు చల్లగా" లో కార్తికేయ క్యారెక్టర్ ఊర మాస్ లెవెల్ లో ఉండటంతో కౌశిక్ తో తమ బ్యానర్ లో సినిమాలు చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక చూడాలి ఈ కొత్త డైరెక్టర్ రానున్న రోజుల్లో ఎంతబాగా తన సినిమాలతో ఆకట్టుకుంటాడో...



ఇప్పటికైనా దిల్ రాజు తన తప్పును తెలుసుకుంటాడా?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>