MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth702446cd-5d4c-454a-aa1d-111386f1a73a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth702446cd-5d4c-454a-aa1d-111386f1a73a-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుమంత్ అక్కినేని. తాతయ్య అక్కినేని నాగేశ్వర రావు, మామయ్య అక్కినేని నాగార్జున ల ఆశీస్సులతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ తొలి సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఫై యువ దర్శకుడు కరుణాకరన్ సుమంత్ తో తీసిన యువకుడు సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా తన టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకున్న సుమంత్ కు ఆపై సూర్య కిరణ్ దర్శకత్వంలో జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన సత్యం మూవీ సూపర్sumanth;telugu cinema;nagarjuna akkineni;karunakaran;allu arjun;annapurna;kiran;nageshwara rao akkineni;puri jagannadh;satya;suma;suma kanakala;sumanth;surya kiran;surya sivakumar;tarun;cinema;media;heroine;success;yuva;arjun 1;nuvve kavali;tarun kumarబాబు ... నేను వదులుకున్నవి రెండే .... మిగతావన్నీ మీరు కల్పించినవి ....??బాబు ... నేను వదులుకున్నవి రెండే .... మిగతావన్నీ మీరు కల్పించినవి ....??sumanth;telugu cinema;nagarjuna akkineni;karunakaran;allu arjun;annapurna;kiran;nageshwara rao akkineni;puri jagannadh;satya;suma;suma kanakala;sumanth;surya kiran;surya sivakumar;tarun;cinema;media;heroine;success;yuva;arjun 1;nuvve kavali;tarun kumarSun, 07 Mar 2021 23:16:32 GMTసినిమా పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుమంత్ అక్కినేని. తాతయ్య అక్కినేని నాగేశ్వర రావు, మామయ్య అక్కినేని నాగార్జున ల ఆశీస్సులతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ తొలి సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఫై యువ దర్శకుడు కరుణాకరన్ సుమంత్ తో తీసిన యువకుడు సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా తన టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకున్న సుమంత్ కు ఆపై సూర్య కిరణ్ దర్శకత్వంలో జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన సత్యం మూవీ సూపర్ హిట్ సాధించి నటుడిగా మంచి బ్రేక్ ని అందించింది.

ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన సుమంత్, ఒకానొక సందర్భంలో తన మామయ్య అక్కినేని నాగార్జున తో కలిసి స్నేహమంటే ఇదేరా మూవీ కూడా చేసారు. అయితే ఆ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల ఇదం జగత్, కపటధారి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు దక్కించుకున్న సుమంత్, కొద్దిరోజుల క్రితం ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా తన కెరీర్ లో మిస్ అయిన పలు సక్సెస్ఫుల్ సినిమాల గురించి చెప్పుకొచ్చారు. తరుణ్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వే కావాలి మూవీ తనదే అని, అయితే అప్పట్లో కొన్ని అనుకోని కారణాల వలన ఆ మూవీ చేయలేకపోయాను అని అన్నారు సుమంత్.

అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన సూపర్ హిట్ మూవీ దేశముదురు కూడా తనదే అని, అయితే ఎందుకో ఆ సినిమాలోని పాత్ర తనకు సెట్ కాదని భావించి ఆ మూవీ ని తాను వదులుకున్నానని సుమంత్ అన్నారు. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, నేడు ఒక సోషల్ మీడియా మాధ్యమంలో సుమంత్ వదులుకున్న సినిమాలు ఇవే అంటూ ఒక మీడియా మాధ్యమం వారు పోస్ట్ చేసిన లిస్ట్ ని చూసిన సుమంత్, బాబు మీరు పోస్ట్ చేసిన లిస్ట్ లో నేను వదులుకున్న సినిమాలు కేవలం రెండే మిగతావన్నీ మీరు సృష్టించినవి అంటూ ఒకింత సరదాగా రిప్లై ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది .....!!


చిరంజీవి వాడే ఫోన్ ఖరీదు తెలిస్తే ...... మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ....??

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>