Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/toilete7c33baa-8044-489e-b812-826909b3eb62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/toilete7c33baa-8044-489e-b812-826909b3eb62-415x250-IndiaHerald.jpg మారుతున్న కాలానికి అనుగుణంగా మనసులు మారుతున్నారు, అలాగే వారి ప్రవర్తన కూడా మారుతూ వస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది తీరికలేని సమయాన్ని గడుపుతున్నారు. ఎలా అంటే టాయిలెట్లో కూడా పేపరు, మొబైల్ వాడే అంతలా. ప్రశాంతంగా విసర్జన మీద శ్రద్ధ చూపాల్సిన పరిస్థితుల్లో బుర్ర కు వేరే పని అప్పగిస్తున్నారు. అయితే ఫలితంగా తెలియకుండానే అనేక రోగాలకు బలవుతున్నారు. ఒకప్పుడు న్యూస్ పేపర్ ని టాయిలెట్ లోకి తీసుకెళ్ళి పని కానిచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం పేపర్ స్థానాన్ని మొబైల్లో సొంతం చేసుకున్నాయి. అంతా ఇప్పుడు మొబైల్ పట్టుtoilet;bhavana;tara;smart phone;media;ee rojullo;shaktiటాయిలెట్ లో అలా చేయడం ప్రమాదకరం..?టాయిలెట్ లో అలా చేయడం ప్రమాదకరం..?toilet;bhavana;tara;smart phone;media;ee rojullo;shaktiSun, 07 Mar 2021 03:00:00 GMTఈ రోజుల్లో చాలా మంది తీరికలేని సమయాన్ని గడుపుతున్నారు. ఎలా అంటే టాయిలెట్లో కూడా పేపరు, మొబైల్ వాడే అంతలా. ప్రశాంతంగా విసర్జన మీద శ్రద్ధ చూపాల్సిన పరిస్థితుల్లో బుర్ర కు వేరే పని అప్పగిస్తున్నారు.  అయితే ఫలితంగా తెలియకుండానే అనేక రోగాలకు బలవుతున్నారు. ఒకప్పుడు న్యూస్ పేపర్ ని టాయిలెట్ లోకి తీసుకెళ్ళి పని కానిచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం పేపర్ స్థానాన్ని మొబైల్లో సొంతం చేసుకున్నాయి. అంతా ఇప్పుడు మొబైల్ పట్టుకుని టిఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. టాయిలెట్ లో మొబైల్ యూస్ చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో రోగాలకు బలవుతున్నారు. అయితే అలా ఉపయోగించడం ప్రమాదకరం. వాటి గురించి కూడా తెలుసుకుందాం.


సోషల్ మీడియా సైట్లను చూసేందుకు టాయిలెట్లే బెటర్ అని చాలామంది భావన. అంతేకాదు మరికొందరు టాయిలెట్లలోకి మొబైళ్లను తీసుకెళ్లి ఇంకా ఏమేమి చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఒకప్పుడు న్యూస్ పేపర్లు మాత్రమే తీసుకెళ్లేవారు. వాటిని ఆ రోజు చదివేసి పక్కన పడేస్తారు కాబట్టి వాటితో దీర్ఘకాలిక సమస్యలేవీ ఉండవు. కానీ, ఆ పేపర్లను తినే పదార్థాలను వేయడానికి ఉపయోగిస్తే మాత్రం ప్రమాదమే. ఇక మొబైళ్ల విషయానికి వస్తే.. అవి ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటాయి. న్యూస్ పేపర్ల తరహాలో ఒక్క రోజు చదివి పడేసేవి కావు. కాబట్టి మొబైల్‌ను టాయిలెట్‌లోకి తీసుకెళ్లిన ప్రతిసారి  దానికి అంటుకొనే బ్యాక్టీరియాల సంఖ్య పెరుగుతూనే ఉంటాయి.ఇంట్లో అన్ని గదుల కంటే టాయిలెట్‌లోనే ఎక్కువ బ్యాక్టీరియాలు నివసిస్తాయి.



టాయిలెట్‌లో ఉండే ప్రతి వస్తువు మీద బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ఫోన్లను టాయిలెట్‌లోకి తీసుకెళ్లినప్పుడు  మీకు తెలియకుండానే అవి మొబైల్‌‌ను కబ్జా చేస్తాయి. మీరు ఫ్లష్, పైపులు పుట్టుకుని మళ్లీ ఫోన్లను ముట్టుకొనేప్పుడు ఇది జరుగుతుంది. జర్నల్ అన్నల్స్ ఆఫ్ క్లీనికల్ మైక్రో‌బయోలజీ అండ్ యాంటిమైక్రో బయోల్స్‌లో ప్రచురించిన స్టడీ ప్రకారం 95 శాతం హెల్త్‌కేర్ వర్కర్ల ఫోన్లు మీద సాల్మొనెల్లా, ఇ. కోలి, సి.డిఫిసీలే వంటి ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాలు ఉన్నట్లు కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం.. టాయిలెట్లో ఉండే వస్తువులు మీద కంటే స్మార్ట్ ఫోన్లే పది రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను మోసుకెళ్తున్నాయని పేర్కొంది. టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత మనం చేతులను శుభ్రం చేసుకుంటాం. కానీ, మొబైల్‌ను శుభ్రం చేయకుండానే వాడతాం.


 ఫలితంగా మొబైల్ నుంచి త్వరగా ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఫోన్లపై ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు మీ శరీరంలోని వివిధ భాగాలను తాకుతాయి. టాయిలెట్‌లో మొబైల్ వాడకం వల్ల మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆందోళనకు గురవ్వుతారు. కాబట్టి మీరు టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొబైల్‌ ఫోన్లను శానిటైజర్‌తో శుభ్రం చేయడం ఉత్తమం.
టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ తెలియకుండానే పాయువుపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల మూల శంఖ వ్యాధి కి గురవ్వుతారు. ఎక్కువ సేపు టాయిలెట్ రింగ్‌పై కూర్చొని.. అవసరం లేకున్నా విసర్జన కోసం పాయువుపై ఒత్తిడి తెస్తుంటారు. దీనివల్ల నొప్పి, వాపు ఏర్పడుతుంది. కొందరికి రక్తస్రావం కూడా కలుగుతుంది. టాయిలెట్‌కు వెళ్లేవారిలో వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పరిశుభ్రత పాటించడం మరింత ముఖ్యం. మీరు బాత్రూంకు వెళ్ళినప్పుడు మీ ఫోన్‌ను బయట ఉంచడమే ఉత్తమం. ఒకవేళ మీరు దానిని మీతో పాటు తీసుకొని వెళ్లినట్లయితే 70 శాతం ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో శుభ్రం చేయండి. అలాగే, టాయిలెట్లో ఎక్కువ సమయం గడపకుండా ప్రయత్నించండి. 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు టాయిలెట్లో గడపకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి టాయిలెట్‌కు వెళ్లేప్పుడు ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి.


వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>