PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpg గ‌త ఏడాది మునిసిప‌ల్ పోరు ప్ర‌క‌టించిన‌ప్పుడు క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గీయులు ప‌లువురు చీరాల‌లో కౌన్సెల‌ర్లుగా నామినేష‌న్లు వేశారు. ఇటు ఆమంచి వ‌ర్గం కూడా నామినేష‌న్లు వేసింది. ఆ త‌ర్వాత అనూహ్యంగా రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. ఎమ్మెల్యే క‌ర‌ణం ఎప్పుడైతే.. వైసీపీ పంచ‌న చేరిపోయారో.. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నేత‌లుగా ఉన్న వాళ్ల‌కే ఇప్పుడు వీరికే వైసీపీ బీ ఫాంలు ఇచ్చేసింది. అంటే.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు అందాయి. ఇక‌, మిగిలిన వాటిలోనూ అంటే మ‌రో 13 వార్డుల్లోనూ క‌ర‌ణం వ‌ర్గీయుల‌కే వైసీపీ బీ ఫాంలు ysrcp tdp;view;adinarayanareddy;2019;district;mla;letter;tdp;chirala;ycp;research and analysis wing;partyపుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?ysrcp tdp;view;adinarayanareddy;2019;district;mla;letter;tdp;chirala;ycp;research and analysis wing;partySun, 07 Mar 2021 11:27:00 GMTప్ర‌స్తుతం జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అనేక ట్విస్టులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో అయితే.. ట్విస్టుల మీద ట్విస్టులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున గ‌త  2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. త‌ర్వాత వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారిన ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం విష‌యంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మొత్తం చీరాల న‌గ‌ర‌పాల‌క సంస్థలో 33 వార్డులు ఉన్నాయి. వీటిలో మూడు మాత్ర‌మే ఏక‌గ్రీవం అయ్యాయి. మిగిలిన వాటిలో టీడీపీ పోటీ లేని వార్డులు 17 ఉన్నాయి.

అయితే.. ఇక్క‌డ బీఫాంలు మాత్రం వైసీపీ నాయ‌కులు టీడీపీ నేత‌ల‌కు అందించారు. అదేంటి ? అని షాక్ అవుతున్నారా ? అస‌లు విష‌యం తెలిస్తే ఏదేం చెత్త రాజ‌కీయంరా ?  బాబు అని త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిందే. గ‌త ఏడాది మునిసిప‌ల్ పోరు ప్ర‌క‌టించిన‌ప్పుడు క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గీయులు ప‌లువురు చీరాల‌లో కౌన్సెల‌ర్లుగా నామినేష‌న్లు వేశారు. ఇటు ఆమంచి వ‌ర్గం కూడా నామినేష‌న్లు వేసింది. ఆ త‌ర్వాత అనూహ్యంగా రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. ఎమ్మెల్యే క‌ర‌ణం ఎప్పుడైతే.. వైసీపీ పంచ‌న చేరిపోయారో.. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నేత‌లుగా ఉన్న వాళ్ల‌కే ఇప్పుడు వీరికే వైసీపీ బీ ఫాంలు ఇచ్చేసింది.

అంటే.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు అందాయి. ఇక‌, మిగిలిన వాటిలోనూ అంటే మ‌రో 13 వార్డుల్లోనూ క‌ర‌ణం వ‌ర్గీయుల‌కే వైసీపీ బీ ఫాంలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప‌రిస్థితి మాత్రం.. దీనికి భిన్నంగా ఉంది. ఆయ‌న వ‌ర్గానికి ఎక్క‌డా కూడా ఒక్క బీఫాం కూడా ల‌భించ‌లేదు. దీంతో ఆమంచి వ‌ర్గం రెబెల్‌గా పోటీకి దిగ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ చీరాల మునిసిప‌ల్ పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇక్క‌డ వైసీపీలో ఆది నుంచి ఉన్న నాయ‌కులు ఒక ర‌కంగా.. క‌ర‌ణం వ‌ర్గం మ‌రోర‌కంగా ప్ర‌చారం చేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై చీరాల‌లో చిత్ర‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజమైన వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ వైసీపీగా ఇక్క‌డ అధికార పార్టీ అభ్య‌ర్థులు పోటీలో ఉన్నట్లైంది.  వైసీపీలో ఆది నుంచి ఉన్న‌వారు రెబెల్స్‌గా పోటీ చేస్తుంటే.. క‌ర‌ణం వ‌ర్గం, ఇటీవ‌ల పార్టీకి మ‌ద్ద‌తుగా మారిన‌వారు మాత్రం అస‌లు సిస‌లు వైసీపీ నేత‌లుగా చ‌లామ‌ణి అవుతుండ‌డ‌మే..!! 


జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>