PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicsa6acfe3c-e5e4-4626-b25b-2045e85aab45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicsa6acfe3c-e5e4-4626-b25b-2045e85aab45-415x250-IndiaHerald.jpg ఏపీ లో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, వంటి పార్టీలు ప్రచారలతో హోరెత్తిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు జనసేన, బి‌జే‌పి పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలపై గట్టిగానే దృష్టి సాధించాయి. అయితే కొత్తగా వీటితో పాటు ఏంఐఏం కూడా ఎన్నికల్లో సత్తా చాటెందుకు సిద్దమైంది. తెలంగాణలో బలమైన మతతత్వ పార్టీగా ఉన్న ఏంఐఏం ఆంద్ర లో కూడా పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది.ap politics;cbn;bindu;bindhu;bharatiya janata party;jagan;vijayawada;andhra pradesh;telangana;janasena;letter;tdp;central government;ycp;janasena partyఆంధ్ర లో ఏంఐఏం ప్రణాళికలు ఫలించేనా..??ఆంధ్ర లో ఏంఐఏం ప్రణాళికలు ఫలించేనా..??ap politics;cbn;bindu;bindhu;bharatiya janata party;jagan;vijayawada;andhra pradesh;telangana;janasena;letter;tdp;central government;ycp;janasena partySun, 07 Mar 2021 14:19:52 GMT ఏపీ లో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, వంటి పార్టీలు ప్రచారలతో హోరెత్తిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు జనసేన, బి‌జే‌పి పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలపై గట్టిగానే దృష్టి సాధించాయి. అయితే కొత్తగా వీటితో పాటు ఏంఐఏం కూడా ఎన్నికల్లో సత్తా చాటెందుకు సిద్దమైంది. తెలంగాణలో బలమైన మతతత్వ పార్టీగా ఉన్న ఏంఐఏం ఆంద్ర లో కూడా పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది.

 అందులో భాగంగానే ఏంఐఏం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఆంధ్ర లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బి‌జే‌పి పైన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఏపీ లో హిందూతత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా హిందూతత్వ రాజకీయాలకు బీజేపీ కేంద్ర బిందువు అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఏపీ లో బీజేపీ ని నిలువరించక పోతే రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవని అన్నారు. చంద్ర బాబును కూడా ఇంటికే పరిమితం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్దం చేస్తుందని అన్నారు.

అయితే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలలో ఆంతర్యం ఏమిటన్నదానిపై రాజకీయ విశ్లేషకులు తమ వాదన ను వినిపిస్తున్నారు. తెలంగాణ మాదిరిగానే ఆంధ్ర లో కూడా ముస్లిం ప్రాంతాలలో పట్టు సాధించేందుకేనని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, కర్నూలు వంటి నగరాలలో ముస్లిం అధికంగా ఉన్న ప్రాంతాలలో తమ కార్పొరేటర్లను రేస్ లో నిలబెట్టింది ఏంఐఏం. అయితే బలమైన రాజకీయ పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ పార్టీలను ఎదుర్కోవడం కన్న, ఇప్పుడిప్పుడే ఆంద్ర మెరుగు పడుతున్న బీజేపీ కి అడ్డు కట్ట వేసి ఆ స్థానం లో ఏంఐఏం ను నిలిపేందుకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏంఐఏం ప్రణాళికలు ఫలిస్తాయో లేదో..?చూడాలి.


రవితేజ సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>