MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suddala-ashok-teja99bba806-0a70-4e95-a3b6-f2b34a715cfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suddala-ashok-teja99bba806-0a70-4e95-a3b6-f2b34a715cfe-415x250-IndiaHerald.jpgసినీ గీత రచయత సుద్దాల అశోక్‌ తేజ మరోసారి వివాదస్పదం అవుతున్నారు. ఆయన రాసిన సారంగ దరియా సాంగ్.. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన సారంగదరియా సాంగ్‌ అదరగొట్టేస్తోంది. ఇప్పటికే రెండున్న కోట్ల వ్యూస్ సాధించింది. అయితే ఈ పాట రచయిత సుద్దాల్ అsuddala-ashok-teja;view;ashok;geetha;sekhar;teja;kamma;cinema;writer;love;director;audio;sai pallavi;love story;fidaaసారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?suddala-ashok-teja;view;ashok;geetha;sekhar;teja;kamma;cinema;writer;love;director;audio;sai pallavi;love story;fidaaSun, 07 Mar 2021 11:00:00 GMTగీత రచయత సుద్దాల అశోక్‌ తేజ మరోసారి వివాదస్పదం అవుతున్నారు. ఆయన రాసిన  సారంగ దరియా సాంగ్.. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన సారంగదరియా సాంగ్‌ అదరగొట్టేస్తోంది. ఇప్పటికే రెండున్న కోట్ల వ్యూస్ సాధించింది.


అయితే ఈ పాట రచయిత సుద్దాల్ అశోక్‌ తేజపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సుద్దాల అశోక్‌తేజ.. ఓ జానపద గీతాన్ని తన పైత్యంతో చెడగొట్టాడని.. ఏవో నాలుగు వాక్యాలు రాసి ఈ పాట రచయితగా చెప్పుకుంటున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఆయన తనపై విమర్శలను సమర్థించుకుంటున్నారు. అందరికీ సొంతమైన ఒక పాపులర్ జానపదంలో పల్లవిని తీసుకుని, దానికి కొనసాగింపు రాసుకుంటే తప్పెలా అవుతుందంటున్నారు ఆయన్ను సమర్థించేవారు..? లవ్ స్టోరీ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ సారంగదరియా పాటను ఆ డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా ట్యూన్‌కు తగినట్టుగా కొత్తగా రాస్తే ఎందుకు తప్పుపట్టాలి..? ఇది తన క్రియేటివ్ ఫ్రీడంను కించపరిచినట్టు కాదా..? అసలు ఆ జానపదం మీద ఎవరికీ రైట్స్ ఉండవు కదా అంటున్నారు.

ఇదే సమయంలో ఆయన మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. అందులో ఆయన చేసిన కామెంట్లు విమర్శలకు తావిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే.. “ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఓ ప్రమాదం ఉంది.. వాళ్లు ఒక ధోరణిలో రాస్తారు.. వాళ్లు చదువుకున్నవాళ్లు కాదు.. వాళ్లకు ప్రత్యేకమైన అకడమిక్ డిగ్రీలుండవ్.. ’’ అంటున్నారు. ఇప్పుడు ఇది విమర్శల పాలవుతోంది. సుద్దాల అశోక్‌ తేజ తన తాజా వ్యాఖ్యల ద్వారా జనపదాలను కించపరుస్తున్నారని విమర్శకులు అంటున్నారు.

జానపద గీతాలు జనం చెమట నుంచి, జనం కన్నీటి నుంచి, జనం సరదాల నుంచి, జనం పండుగల నుంచి, జనం ఉద్వేగాల నుంచి పుట్టుకొస్తాయి. వాటిని చదువుకున్నవాళ్లే రాయరు.. అవి జనం నోళ్లలో నానతాయి.. తరతరాలుగా ప్రవహిస్తాయి. అలాంటి వాళ్లను  అకడమిక్ డిగ్రీలుండవ్ అంటూ సుద్దాల కామెంట్ చేయడం సరికాదంటున్నారు. 


జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>