Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/puchhakaya-ginjaluf1350a69-ae0b-4087-a455-c93b916398ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/puchhakaya-ginjaluf1350a69-ae0b-4087-a455-c93b916398ab-415x250-IndiaHerald.jpgవేస‌వి కాలంలో పుచ్చ‌కాయ‌ను తింటే దాంతో మ‌న‌కు ఎన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి అవ‌స‌రమైన ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అందుతాయి. దీనికి తోడు ప‌లు అనారోగ్య స‌మస్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. అయితే కేవ‌లం పుచ్చ‌కాయ మాత్ర‌మే కాదు, అందులో ఉండే గింజ‌లు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. వాటితో క‌లిగే లాభాల‌ను గురించి తెలుసుకుందాం. puchhakaya ginjalu;vitamin;heart;aquaపుచ్చకాయ గింజల తో ఆరోగ్య ప్రయోజనాలు...?పుచ్చకాయ గింజల తో ఆరోగ్య ప్రయోజనాలు...?puchhakaya ginjalu;vitamin;heart;aquaSun, 07 Mar 2021 09:00:00 GMT

 పుచ్చ‌కాయ విత్త‌నాల్లో అనేక ర‌కాల ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్ ఉంటాయి. విట‌మిన్ బి, థ‌యామిన్‌, నియాసిన్‌, ఫోలేట్‌, పొటాషియం, ఐర‌న్‌, జింక్‌, పాస్ఫ‌ర‌స్‌, కాప‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి కూడా బాగానే ల‌భిస్తుంది. కేవ‌లం 100 గ్రాముల పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తీసుకుంటే వాటిలో 600 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది.వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్లబర్చుకోవడానికి పుచ్చకాయలు ఉపయోగపడతాయి.నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్లో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికం.పుచ్చకాయలో అధిక క్యాలరీలు కూడా ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి ఇది మంచి డైట్.


పుచ్చకాయలో ఉండే లైకోపీస్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.పుచ్చకాయ గింజల్లో విటమిన్-B అధికంగా ఉంటుంది.ఈ గింజలను తింటే గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.పుచ్చకాయ గింజలను ఆహారం తీసుకుంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే.. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయట.
 జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చ గింజలు తోడ్పడతాయి.పుచ్చకాయ గింజల నుంచి సేకరించిన తర్వాత కొద్ది రోజులు ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని పొడిగా చేయండి.


2 లీటర్ల నీటిలో 2 టేబుల్ స్పూన్ల పుచ్చ గింజల పొడి వేసి 15 నిమిషాలు మరిగించాలి. ఈ పొడిని రెండు రోజులు తాగాలి. మధ్యలో ఒక్క రోజు విరామం ఇవ్వాలి. ఆ తర్వాత వరుసగా రెండు రోజులు తాగాలి. ఇలా చేయడం వల్ల పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ శరీరానికి దక్కుతాయి.పుచ్చకాయ విత్త‌నాల‌ను పుచ్చ‌కాయల్లాగే నేరుగా తిన‌వ‌చ్చు. కానీ వాటి రుచి చాలా మందికి న‌చ్చ‌దు. అయితే అలా తిన‌లేక‌పోతే వాటిని ఎండ‌బెట్టి పొడి చేసుకుని నీటిలో క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. లేదంటే విత్త‌నాల‌ను నీటిలో బాగా మ‌రిగించి ఆ నీటిని తాగాలి. అప్పుడు అనేక అద్భుత‌మైన‌ ఫ‌లితాలు క‌లుగుతాయి


ఆ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడ్డంగా బుక్ అయిన టీటీడీ ఉద్యోగులు

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>