HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/malabhadakam-d7d91e78-1a79-448f-b513-10c19032d071-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/malabhadakam-d7d91e78-1a79-448f-b513-10c19032d071-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మరీ ముఖ్యంగా చాలామంది అతి సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. శరీరంలోని జీర్ణాశయంలో ప్రేగు కదలికలు సక్రమంగా లేనప్పుడు మలవిసర్జన కష్టమవుతుంది. దీనినే మలబద్దకం అంటారు. సమయానికి తినకపోవడం, అమితంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటి ఎక్కువగా తినడం, అంతేకాకుండా జీర్ణంకాని ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. ఇక ఈ సమస్య ఉన్నప్పుడు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా మలవిసర్జన కాక ఇబ్బంది పడుతూ ఉంటారు.. malabhadakam,;rasam;mandula;oilమలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే.. ఇలా చేయండి..!మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే.. ఇలా చేయండి..!malabhadakam,;rasam;mandula;oilSun, 07 Mar 2021 22:19:09 GMTప్రస్తుత కాలంలో మరీ ముఖ్యంగా చాలామంది అతి సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. శరీరంలోని జీర్ణాశయంలో ప్రేగు కదలికలు సక్రమంగా లేనప్పుడు మలవిసర్జన కష్టమవుతుంది. దీనినే మలబద్దకం అంటారు. సమయానికి తినకపోవడం, అమితంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటి ఎక్కువగా తినడం,  అంతేకాకుండా జీర్ణంకాని ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. ఇక ఈ సమస్య ఉన్నప్పుడు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా మలవిసర్జన కాక ఇబ్బంది పడుతూ ఉంటారు..


మలబద్ధకం సమస్య తగ్గాలి అంటే చాలామంది ఇంగ్లీష్ మందుల పై ఆధార పడుతున్నారు. తాత్కాలికంగా ఈ మందులు ఫలితాన్ని ఇచ్చినా, ఆ తర్వాత దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఎన్నో సమస్యలను, ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. అయితే వంటింటి చిట్కాలు మలబద్దకానికి చక్కని ఔషధాలు అంటున్నారు నిపుణులు. అయితే అవేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ఒకవేళ మీరు గనక మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లైతే,అందుకు ఆముదం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపు మీద కొద్దిగా ఆముదం నూనె రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాల సంకోచాన్ని పెంచి, మలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా మలవిసర్జన సక్రమంగా జరుగుతుంది. ఇక మరొక  చిట్కా.. ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె లో, ఒక కప్పు నారింజ రసం కలిపి తాగడం వల్ల మల విసర్జన  సజావుగా జరుగుతుంది. నారింజ రసంలో ఉండే ఫైబర్ అలాగే ఆముదం మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి..


ఒక కప్పు నిమ్మరసం లో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలిపి తాగాలి. నిమ్మ రసం యొక్క ఆమ్ల స్వభావం ప్రేగు కదలికలను తేలిక చేయడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. ఫలితంగా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ఇక మరొక చిట్కా ఏమిటంటే.. మలబద్ధకాన్ని నివారించడానికి పాలు, ఆముదం కూడా ప్రయోజనకరం. ఇందుకోసం  ఒక కప్పు పాలు , అందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలిపి తాగాలి.. ఇలా చేయడం వల్ల కూడా మలబద్ధకం  సమస్యను నివారించవచ్చు.


2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>