PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/surgery-done-stitches-were-left-in-up-doctersc8351065-fec7-4ccc-bd87-5b2cfa74398e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/surgery-done-stitches-were-left-in-up-doctersc8351065-fec7-4ccc-bd87-5b2cfa74398e-415x250-IndiaHerald.jpgఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి దారుణ ఘటనే జరిగింది. వైద్యుల క్రూరత్వానికి ఓ చిన్నారి పాప బలైంది. హాస్పిటల్‌ బిల్లులు పూర్తిగా చెల్లించలేదన్న కారణంతో సర్జరీ తర్వాత కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు హాస్పిటల్ సిబ్బంది. దీంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది.surgery;district;local languageఇంత దారుణమా! సర్జరీ చేశారు.. బిల్లు కట్టలేదని కుట్లు వదిలేశారు..ఇంత దారుణమా! సర్జరీ చేశారు.. బిల్లు కట్టలేదని కుట్లు వదిలేశారు..surgery;district;local languageSat, 06 Mar 2021 19:37:07 GMT
ఇంతటి అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో ఆలస్యంగా  వెలుగు చూసింది. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్‌ టౌన్‌కు చెందిన మూడు సంవత్సరాల ఓ చిన్నారికి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పి రావటంతో ప్రయాగ్‌ రాజ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్‌ చేశారు. అయితే హాస్పిటల్‌ బిల్లులు మొత్తం కట్టలేదన్న కారణంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే పాపును కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో పాప మరణించింది.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ఓ వ్యక్తి తన ఖాతాలో షేర్‌ చేయటంతో సంఘటన వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన స్థానిక వైద్యాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. హాస్పిటల్ బిల్లు కట్టలేదని.. సర్జరీ చేసి కుట్లు వేయకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ హాస్పిటల్ ను సీజ్ చేయడంతో పాటు కుట్ల వేయకుండా వెళ్లిన డాక్టర్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ, మళ్లీ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.





టాలీవుడ్ అంటే చిన్న చూపేనా...?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>