BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/thati-munjalu4a913a96-890f-4531-bb69-48386c47acf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/thati-munjalu4a913a96-890f-4531-bb69-48386c47acf9-415x250-IndiaHerald.jpgవేసవికాలంలో తాటి ముంజల కు చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో ఉండే వేడికి మన శరీరం తట్టుకోవాలి అంటే, తప్పకుండా తాటి ముంజలు తినాల్సి ఉంటుంది. అందుకే తాటిముంజలను "ఐస్ ఆపిల్స్" అని కూడా అంటారు. అందుకనే ఈ వేసవి కాలంలో పుచ్చకాయ తో పాటు తాటి ముంజలు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిని తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ నుండి తప్పించుకుంటుంది. అలాగే శరీరానికి కావలసిన నీరు అంది అలసట లేకుండా చేస్తుంది. thati munjalu;vitamin c;vitamin a;iron;vitamin;cancer;aqua;cholesterol;niacinవేసవికాలంలో తాటి ముంజలు మనకు ఎలా సహాయపడతాయో తెలుసా..?వేసవికాలంలో తాటి ముంజలు మనకు ఎలా సహాయపడతాయో తెలుసా..?thati munjalu;vitamin c;vitamin a;iron;vitamin;cancer;aqua;cholesterol;niacinSat, 06 Mar 2021 11:03:25 GMT

తాటి ముంజలలో  విటమిన్ ఏ, విటమిన్ డి,విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం తోపాటు బి-కాంప్లెక్స్,నియాసిన్, రైబోఫ్లేవిన్, థయామిన్, జింక్, ఫాస్ఫరస్,పొటాషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి.  అంతేకాకుండా కాలేయ సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. తాటి ముంజలలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఏర్పడే వ్యర్థపదార్థాలు తొందరగా బయటకు వెళ్తాయి..


అయితే తాటి ముంజల  పైన తొక్క తీయకుండా అలాగే తినాలి. ఎందుకంటే వాటిలోని మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి తాటి ముంజలు ఎంతగానో సహాయపడతాయి. అధిక బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడతాయి. పిల్లలకు, వృద్ధులకు వేడి తాపాన్ని తట్టుకోవడానికి ఈ తాటి ముంజలు ఎంతగానో ఉపకరిస్తాయి..


అంతేకాకుండా బీపీని అదుపులో ఉంచి,కొవ్వును తగ్గిస్తుంది. ఎముకలు బలంగా మారడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తాటి ముంజలు చాలా మంచివి. అలాగే రొమ్ము క్యాన్సర్ కు కారణం అయ్యే పెట్రో కెమికల్స్ ను నిర్మూలిస్తుంది. కడుపులో మంట, అజీర్తి,ఎసిడిటీ సమస్యలను కూడా ఈ తాటి ముంజలు దూరం చేస్తాయి.. ఖరీదు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ.. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిని ఆనందం గా,ఎంజాయ్ చేస్తూ, తింటూ ఈ వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు వీలుగా ఉంటుంది.  కాబట్టి తాటి ముంజలు కేవలం పల్లెల్లోనే కాకుండా ఇప్పుడు పట్టణాల్లో కూడా అమ్ముతున్నారు.  వీలైనంతవరకు తాటి ముంజలు తొక్కతో సహా తినడానికి ప్రయత్నించండి.




ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>