Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/thalagada49b3d47f-98a2-484c-b82b-5cf7e2444397-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/thalagada49b3d47f-98a2-484c-b82b-5cf7e2444397-415x250-IndiaHerald.jpg సాధారణంగా ప్రతి ఇంట్లోనూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా తలగడను ఉపయోగిస్తుంటారు. అయితే మన ఇంట్లో వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటాం. అలాగే తలగడ కవర్లను కూడా మారుతూ ఉంటాము. కానీ తలగడలను మాత్రం రోజులు గడిచిన ఏళ్ళు గడిచిన సరే అవే తలగడలను పోయే ఇస్తాం, అంతేకానీ వాడిని అయితే ఎప్పటికీ మార్చుం. అయితే ఒక డాక్టర్ మాత్రం తలగడను రెండేళ్లకు మించి వాడకూడదని అంటున్నాడు. అయితే ఎందుకు ఏమిటి అనే కదా మీ డౌట్? ఆ విషయం గురించి తెలుసుకుందాం. thalagada;health;karan johar;achu;jeevitha rajaseskhar;raj;india;doctor;oilతలగడను ఎక్కువగా వాడితే ఏమవుతుంది..?తలగడను ఎక్కువగా వాడితే ఏమవుతుంది..?thalagada;health;karan johar;achu;jeevitha rajaseskhar;raj;india;doctor;oilSat, 06 Mar 2021 03:00:00 GMTడాక్టర్ మాత్రం తలగడను రెండేళ్లకు మించి వాడకూడదని అంటున్నాడు. అయితే ఎందుకు ఏమిటి అనే కదా మీ డౌట్?  ఆ విషయం గురించి తెలుసుకుందాం.


యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ కు చెందిన డాక్టర్ కరణ్ రాజ్ ‘టిక్‌టాక్’ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యారు. వెర్రి గంతులు పిచ్చి వేషాలతో కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య సూత్రాలతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ఆయనకు ఇండియా నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఇండియాలో ‘టిక్‌టాక్’ బ్యాన్ చేయడం వల్ల ఆయన వీడియోలు మనకు అందుబాటులో ఉండటం లేదు.కోవిడ్-19 సమయంలో డాక్టర్ కరణ్ రాజ్ ఇచ్చిన సూచనలు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయన వీడియోలను షేర్ చేసుకుంటున్నారు.


తాజాగా రాజ్ మనం జీవితంలో భాగమైన తలగడలు గురించి చెప్పారు. ఇంట్లో తలగడ కవర్లు మార్చితే సరిపోదని, తలగడలను కూడా మార్చాలని ఆయన తెలిపారు. దీని గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మీ ఇంట్లో తలగడలను కనీసం రెండేళ్లకు ఒకసారైన మార్చాలి. ఎందుకంటే అందులో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. దుమ్ము-దూళి, చివరికి మన చెమట వల్ల పురుగులు కూడా పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తి ఏడాదికి నాలుగు కిలోల చర్మాన్ని వదులుతాడు. అదంతా తలగడలోకే చేరుతుంది. అవి సూక్ష్మ ధూళి పురుగులకు ఆహారంగా మారుతుంది. ఒక్క దూళి పురుగు రోజుకు సుమారు 200 సార్లు విసర్జిస్తాయి. అంటే.. కాలం పెరిగేకొద్ది అవి ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు’’ అని తెలిపారు.‘‘ఆయిల్ లేదా చెమట వల్ల తలగడపై పడే మరకలు కూడా ప్రమాదకరమైనవే.


ఆ మరకలు క్రమేనా తలగడలో అచ్చులుగా మారతాయి. వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది’’ అని తెలిపారు. అదండీ సంగతి. ఇది చదివిన తర్వాత  మీ తలగడ ఎప్పుడు కొన్నారు? దాన్ని ఎన్నాళ్లుగా వాడుతున్నారనే లెక్కలు వేసుకుంటున్నారా? నో డౌట్ మీరు వాడే తలగడ కనీసం రెండేళ్లకు మించే ఉంటుంది. ఎందుకంటే మనలో చాలామందికి డాక్టర్ రాజ్ చెప్పిన విషయాలు తెలియవు. ఇప్పుడైనా.. ఆయన చెప్పిన మాటలు గుర్తుంచుకుని తలగడలను కూడా మార్చండి. లేదా.. డేటాల్ వంటి బ్యాక్టీరియాలను చంపే ద్రవాల్లో నాబెట్టి.. ఉతికి ఆరేయండి. దానివల్ల కనీసం కొంతవరకైనా బ్యాక్టీరియా నశిస్తుంది. తలగడకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుందంటే.. మనం వాడే పరుపులకు కూడా ఈ ముప్పు ఉండవచ్చు. కాబట్టి పరిశుభ్రంగా ఉండండి. ఆరోగ్యంగా జీవించండి


హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>