Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/frog-romance20474d86-ec7b-4b50-af55-64251c7138c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/frog-romance20474d86-ec7b-4b50-af55-64251c7138c2-415x250-IndiaHerald.jpgభూమిపై జీవంతో ఉన్న ప్రతి జీవజాతిలోనూ శృంగారం ఉంటుంది. అలాగే శృంగారం కోసం మగ జీవిని ఆడ జీవి ఆకర్షించడం, ఆడ జీవిని మగ జీవి ఆకర్షించడం సాధారణం. అయితే మనుషులలో మాటలతో, సైగలతో స్పర్శతో మన కోరికను అవతలి వారికి తెలియజేస్తాం. అయితే జంతువుల్లో..frog romance;manu;v;shaktiరొమాన్స్ కోసం మగ కప్పలు అలా చేస్తే.. ఆడ కప్పలు ఇలా చేస్తాయటరొమాన్స్ కోసం మగ కప్పలు అలా చేస్తే.. ఆడ కప్పలు ఇలా చేస్తాయటfrog romance;manu;v;shaktiSat, 06 Mar 2021 22:14:51 GMTఇంటర్నెట్ డెస్క్: భూమిపై జీవంతో ఉన్న ప్రతి జీవజాతిలోనూ శృంగారం ఉంటుంది. అలాగే శృంగారం కోసం మగ జీవిని ఆడ జీవి ఆకర్షించడం, ఆడ జీవిని మగ జీవి ఆకర్షించడం సాధారణం. అయితే మనుషులలో మాటలతో, సైగలతో స్పర్శతో మన కోరికను అవతలి వారికి తెలియజేస్తాం. అయితే జంతువుల్లో ఎలా..? అంటే, అవి కూడా శృంగారం కోసం జంటను వెతుక్కునేందుకు అనేక రకాల విధానాలను పాటిస్తాయి. అందులో కప్పలు పాటించే విధానం కొంత ఫన్నీగా ఉంటుంది.

కొన్ని రకాల కప్పలు భారీగా శబ్దాలు చేస్తాయి. ఈ వింత ధ్వనుల ద్వారానే అవి ఆడ కప్పలను ఆకర్షిస్తాయి. ఈ క్రమంలో అవి చేసే శబ్దాల తీవ్రతను ఆడ కప్పలు తగ్గించుకుంటాయని తాజా పరిశోధన చెబుతోంది. ‘ది అట్లాంటిక్’ అనే నివేదికలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. మగ కప్పల శబ్దాలను ఆడ కప్పల ఊపిరితిత్తులు తగ్గిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. వాటి ఊపిరితిత్తులకు ఈ శక్తి సహజ సిద్ధంగా లభిస్తుందని వారంటున్నారు.

జతకట్టే సమయంలో తమ జాతికి చెందిన ఆడ కప్పలను ఆకర్షించేందుకు మగ కప్పలు భారీ శబ్దాలు చేస్తాయి. వీటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కొన్నిసార్లు 100 డెసిబుల్స్ కంటే ఎక్కువ తీవ్రత ఉండే శబ్దాలు చేస్తాయి. వీటి వల్ల మనుషుల్లో వినికిడి సమస్యలు కూడా రావచ్చట. అయితే ఈ శబ్దాల తీవ్రతను ఆడ కప్పల ఊపిరితిత్తులు గ్రహించడంతో పాటు, వాటి తీవ్రతను తగ్గించుకుంటాయట.

మిన్నెసోటాలోని సెయింట్ ఓలాఫ్ కాలేజీకి చెందిన నార్మన్ లీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేశారు. వారి పరిశోధన ప్రకారం.. ‘ఆడ కప్పల ఊపిరితిత్తులు, వాటి కర్ణభేరిపై సున్నితత్వాన్ని తగ్గిస్తాయి. ఇవి ఇతర జాతుల కప్పలు చేసే శబ్దాల ప్రభావాన్ని, బ్యాక్ గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించుకుంటూ.. తమ జాతి కప్పల శబ్దాలను గుర్తిస్తాయి. ఈ ప్రక్రియను 'స్పెక్ట్రల్ కాంట్రాస్ట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్' అంటారు. అంటే ఆడ కప్పల ఊపిరితిత్తులు నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్లుగా పనిచేస్తాయి. మగ కప్పలు చేసే శబ్దాల స్పెక్ట్రమ్‌లోని ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని తమ జాతి కప్పల ఫ్రీక్వెన్సీని తెలుసుకుంటాయి. చాలా జాతుల కప్పల్లో పునరుత్పత్తికి ఇలాంటి శబ్దాలే మూలం.


వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>