Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/ship-in-sky772e1522-cfbb-4a04-a1fa-812ade563c17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/ship-in-sky772e1522-cfbb-4a04-a1fa-812ade563c17-415x250-IndiaHerald.jpgవిమానాలు ఆకాశంలో తిరగాలి. వాహనాలు నేలపై తిరగాలి. పడవలు సముద్రంలో తిరగాలి. అంతేకానీ.. ఇదేంటి పడవ గాల్లో తేలుతోందని చెబుతున్నానుకుంటున్నారా..? నిజం. సముద్రంలో వెళ్లాల్సిన పడవ ఉన్నట్లుండి సముద్రంలో మాయమై ఆకాశంలో చేరింది. చక్కగా మేఘాల్లో విహరించడం మొదలు పెట్టింది. నీళ్లలో ఉండాల్సిన భారీ పడవ ఒక్కసారిగా మబ్బుల్లోకి చేరడంతో..ship in sky;maya;tara;sea;nijamమబ్బుల్లో పడవ.. చూసిన వాళ్లు షాక్.. వైరల్ అవుతున్న ఫోటోలుమబ్బుల్లో పడవ.. చూసిన వాళ్లు షాక్.. వైరల్ అవుతున్న ఫోటోలుship in sky;maya;tara;sea;nijamSat, 06 Mar 2021 14:04:34 GMTఇంటర్నెట్ డెస్క్: విమానాలు ఆకాశంలో తిరగాలి. వాహనాలు నేలపై తిరగాలి. పడవలు సముద్రంలో తిరగాలి. అంతేకానీ.. ఇదేంటి పడవ గాల్లో తేలుతోందని చెబుతున్నానుకుంటున్నారా..? నిజం. సముద్రంలో వెళ్లాల్సిన పడవ ఉన్నట్లుండి సముద్రంలో మాయమై ఆకాశంలో చేరింది. చక్కగా మేఘాల్లో విహరించడం మొదలు పెట్టింది. నీళ్లలో ఉండాల్సిన భారీ పడవ ఒక్కసారిగా మబ్బుల్లోకి చేరడంతో నేలపై నుంచి దానిని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నమ్మడం లేదా..? అయితే ఈ ఫోటో చూడండి. మీరు కూడా నమ్ముతారు.  అంతేకాదు.. అసలు విషయం తెలిస్తే ఆ పడవ నిజంగానే మబ్బుల్లో తేలుతోందని మీరే ఒప్పుకుంటారు.

ఫోటోలో కనపడుతోంది నిజమైన చిత్రం. ఎవరైనా గీసినదో, లేక ఫొటోషాప్ చేసినదో కాదు.కొలిన్ మెక్‌కల్లమ్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఇది. స్కాట్లాండ్‌లోని బాఫ్ అనే ప్రాంతంలో అతడు రోడ్డుపై వెళ్తున్నాడు. ఆ రోడ్డుపై నుంచి చూస్తే సముద్రంలో వెళ్లే పడవలు కనిపిస్తుంటాయి. ఆ రోజు కూడా అలాంటి ఘటనే జరిగింది. అయితే అతని కంట పడిన పడవ నీళ్లలో వెళ్లడం లేదు. నడిసముద్రంలో గాల్లో తేలుతోంది. దాన్ని చూసిన కొలిన్ వెంటనే ఫొటోలు తీశాడు. ఆ తర్వాత జాగ్రత్తగా గమనించి అసలు ఆ పడవ అలా గాల్లో తేలుతున్నట్లు కనిపించడానికి కారణం కనిపెట్టాడు.

ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొలిన్.. దీన్ని ఓ రియల్ లైఫ్ ఆప్టికల్ ఇల్యూజన్ అని వివరించాడు. పడవ అలా గాల్లో కనపడగానే నిజంగానే గాల్లో తేలుతోందేమని భయపడినట్లు కొలిన్ చెప్పాడు. భూమికి దగ్గరగా తిరిగే మేఘాల వల్లే ఇలాంటి మాయ ఏర్పడిందని చెప్పాడు. ఈ మేఘాలు పడవ కింది భాగాన్ని కప్పేశాయని, ఆకాశంలో అవి కలిసిపోవడం వల్ల, పడవ కింది భాగం కనిపించకుండా మాయమైపోయిందని చెప్పాడు. అయితే పై భాగం మాత్రం కనిపించడంతో అది గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోందని అసలు విషయం కొలిన్ బయటపెట్టాడు. 


హెరాల్డ్ సెటైర్: బెజవాడ టీడీపీ కుల సంఘం అయిపోయిందే

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>