Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chocolate1764c77d-bfdb-4999-9b8c-a36e7df733a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chocolate1764c77d-bfdb-4999-9b8c-a36e7df733a6-415x250-IndiaHerald.jpgచాక్లెట్ అంటే ఇష్ట‌ప‌డని వారు ఈ భూమ్మీద ఎవ‌రైనా ఉంటారా? ఒక చిన్న చాక్లెట్ ముక్క నోట్లో క‌రిగిపోతే చాలు మూడ్ ఎంత బాగాలేక‌పోయినా అంతా ఇట్టే సెట్ అయిపోతుంది. అంతేనా దీన్ని తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డం, కంటిచూపును మెరుగ్గా చేయ‌డం, ర‌క్త‌పోటును త‌గ్గించ‌డం వంటివి చేయ‌డ‌మే కాదు ఇది అందాన్ని పెంపొందించేందుకు ఎంతో సాయ‌ప‌డుతుంది. చాక్లెట్‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి.ఇవి చర్మ‌క‌ణాల రిపేర్‌లో తోడ్ప‌డి చ‌ర్మం అందంగా, మృదువchocolate;chocolate;cholesterol;nijam;vచాక్లెట్ తో అందం ఆరోగ్యం..?చాక్లెట్ తో అందం ఆరోగ్యం..?chocolate;chocolate;cholesterol;nijam;vSat, 06 Mar 2021 07:00:00 GMTచాక్లెట్ అంటే ఇష్ట‌ప‌డని వారు ఈ భూమ్మీద ఎవ‌రైనా ఉంటారా? ఒక చిన్న చాక్లెట్ ముక్క నోట్లో క‌రిగిపోతే చాలు మూడ్ ఎంత బాగాలేక‌పోయినా అంతా ఇట్టే సెట్ అయిపోతుంది. అంతేనా దీన్ని తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డం, కంటిచూపును మెరుగ్గా చేయ‌డం, ర‌క్త‌పోటును త‌గ్గించ‌డం వంటివి చేయ‌డ‌మే కాదు  ఇది అందాన్ని పెంపొందించేందుకు ఎంతో సాయ‌ప‌డుతుంది. చాక్లెట్‌లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి.ఇవి చర్మ‌క‌ణాల రిపేర్‌లో తోడ్ప‌డి చ‌ర్మం అందంగా, మృదువుగా మారేలా చేస్తాయి. రోజూ చాక్లెట్ తిన‌డం వ‌ల్ల మీ ఆరోగ్యానికి, అందానికి ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని చెబితే మీరు న‌మ్ముతారా?


చాలామంది ఈ మాట వింటే న‌వ్వుకుంటారు. కానీ ఇది నిజంగా నిజం. అయితే పూర్తిగా చాక్లెట్ బార్ మొత్తం లాగించేస్తే కాద‌నుకోండి. రోజుకో చిన్న ముక్క తిన‌డం మంచిదన్నమాట‌. ఎందుకంటే చాక్లెట్‌, కొకోవా, కొకోవా బ‌ట‌ర్‌ల‌లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. ఇవి మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి. మ‌రి, దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలుంటాయో తెలుసుకుందాం రండి.చాక్లెట్ ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. అన్ని ర‌కాల చాక్లెట్లు మ‌న ఆరోగ్యానికి మంచివి కావు. ప్ర‌స్తుతం ఎక్కువ‌గా ల‌భించే చాక్లెట్ల‌లో ఎక్కువ శాతం పాలు, పంచ‌దార మాత్ర‌మే ఉంటున్నాయి.దీని వ‌ల్ల ఆ చాక్లెట్లు మ‌న‌లో కొవ్వును పెంచేందుకు త‌ప్ప ఇంకెందుకూ ఉప‌యోగ‌ప‌డ‌వు.


ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ కేవ‌లం డార్క్ చాక్లెట్ మాత్ర‌మే క‌లిగి ఉంటుంది.అందుకే క‌నీసం 70 శాతం మేర‌కు డార్క్ చాక్లెట్ ఉన్న బార్స్‌ని తీసుకోండి. చాక్లెట్ శాతం ఎంత ఎక్కువ‌గా ఉంటే అది అంత ఆరోగ్య‌క‌ర‌మ‌న్న‌మాట‌. మామూలు చాక్లెట్‌లా దీన్ని తిన‌డం అంత సులువేం కాదు. ఇది కాస్త చేదుగా కూడా ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం ఆ మాత్రం చేదు తిన‌డం త‌ప్పు కాదు.చాక్లెట్ వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. అంతే కాదు  ఇది మ‌న చ‌ర్మం, జుట్టు, శ‌రీరానికి కూడా ఎంతో ప్ర‌యోజ‌న‌కారి. చాక్లెట్ ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను పెంచుతుంది. చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తుంది. జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తుంది. చాక్లెట్ మ‌న చ‌ర్మానికి అవ‌స‌ర‌మైన ఎన్నో విట‌మిన్లు, మినర‌ల్స్‌తో నిండి ఉంటుంది. క్యాల్షియం, ఐర‌న్‌తో పాటు విట‌మిన్ ఎ, బి1, సి, డి, ఇ విట‌మిన్లు కూడా ఇందులో ఉంటాయి.

ప్ర‌తి కొకొవా బీన్‌లోనూ ఎన్నో ట్యానిన్లు, ఫ్లేవ‌నాయిడ్స్‌, పాలీఫీనాల్స్ వంటివి నిండి ఉంటాయి. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హించే కాప‌ర్‌, జింక్‌, ఐర‌న్ వంటివ‌న్నీ ఇందులో ఉంటాయి. అందుకే దీన్ని రోజూ చిన్న ముక్క తిన‌డం వ‌ల్ల జుట్టు వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇవి చ‌ర్మాన్ని కూడా మ‌రింత మృదువుగా మారుస్తాయి. ఇవే కాదు మూడ్ బాగాలేన‌ప్పుడు చాక్లెట్ ముక్క తిన‌డం వ‌ల్ల మూడ్ మెరుగు అవుతుంద‌ని ఎన్నో పరిశోధ‌న‌లు తేల్చి చెప్పాయి. చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లతో పాటు కాస్త చ‌క్కెర కూడా ఉంటుంది. ఇవ‌న్నీ మెద‌డుపై ప‌నిచేసి మ‌న మూడ్‌ని మారుస్తాయి.


మైనర్ అయితే ఏంటి.. అస్సలు తప్పించుకోలేరు.. ఇదే ప్రూఫ్..?

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>