PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-bala-ram-tdpf89a98ac-efe1-4687-a642-631811add5fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-bala-ram-tdpf89a98ac-efe1-4687-a642-631811add5fb-415x250-IndiaHerald.jpg దీనిని ఆయ‌న ఎన్నిక‌ల అఫిడవిట్‌లో దాచిపెట్టార‌ని.. సో.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అసెంబ్లీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కూడా అభ్య‌ర్థించారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంది. ఆ త‌ర్వాత దీనిపై పెద్ద ర‌చ్చ జ‌ర‌గ‌గా ఏపీ రాజ‌కీయాల్లో క‌ర‌ణం వార్త‌ల్లో నిలిచారు. అంబికా కృష్ణ మాత్రం త‌న త‌ల్లిని భార్య‌గా... త‌న‌ను కుమార్తెగా గుర్తించాల‌ని పెద్ద ఫైటే చేస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే స్థానిక ఎన్నిక‌ల‌లో క‌ర‌ణం వ‌ర్గం పోటీ చేస్తోంది. మునిసిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో క‌ర‌ణం వ‌ర్గం పోటీ చేస్తున్న చోట‌.karanam bala ram tdp;krishna;andhra pradesh;district;cinema;high court;court;assembly;mla;minister;letter;tdp;local language;chirala;father;party;chitramక‌ర‌ణంకు వ్య‌తిరేకంగా క‌ర‌ణం ప్ర‌చారం... తండ్రికొడుకుల ఉక్కిరి బిక్కిరి ?క‌ర‌ణంకు వ్య‌తిరేకంగా క‌ర‌ణం ప్ర‌చారం... తండ్రికొడుకుల ఉక్కిరి బిక్కిరి ?karanam bala ram tdp;krishna;andhra pradesh;district;cinema;high court;court;assembly;mla;minister;letter;tdp;local language;chirala;father;party;chitramSat, 06 Mar 2021 19:36:29 GMTప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు.. క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి కి రాజ‌కీయంగా శ‌త్రువుల క‌న్నా కూడా ఇంట్లో కుటుంబ స‌భ్యుల ప‌రంగా ఆయ‌న‌కు వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ ప్ర‌కాశం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. దీంతో ఆయ‌న ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క‌.. ఇబ్బంది ప‌డుతున్నార‌న్న ప్ర‌చారం కూడా జోరుగా జ‌రుగుతోంది. బ‌ల‌రాం కుమార్తెగా గ‌తంలో కోర్టుకు వెళ్లిన క‌ర‌ణం అంబికా కృష్ణ‌ చీరాల‌లో ఇప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. చిత్రంగా ఆమె.. అరాచ‌కాల‌కు, అన్యాయాల‌కు వ్య‌తిరే కంగా ఓటు వేయాలంటూ ఆమె ఏ క‌ర‌ణంను అయితే తండ్రిగా పేర్కొంటూ కోర్టుకు ఎక్కిందో ఆయ‌న్ను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తోన్న ప‌రిస్థితి ఉండ‌డంతో చీరాల‌లో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ జోరందుకుంది.
గ‌తంలో క‌ర‌ణం విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ఆయ‌న‌పై అంబికా కృష్ణ తాను ఆయ‌న కుమార్తెను అని.. త‌న‌ను కుమార్తెగా గుర్తించాలంటూ హైకోర్టులో కేసు వేశారు. స‌న‌త్‌న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే అయిన‌ కాట్ర‌గ‌డ్డ ప్రసూన‌ను త‌న తండ్రి అయిన క‌ర‌ణం బ‌ల‌రాం రెండో వివాహం చేసుకున్నార‌ని.. దీనిని ఆయ‌న ఎన్నిక‌ల అఫిడవిట్‌లో దాచిపెట్టార‌ని.. సో.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అసెంబ్లీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కూడా అభ్య‌ర్థించారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంది. ఆ త‌ర్వాత దీనిపై పెద్ద ర‌చ్చ జ‌ర‌గ‌గా ఏపీ రాజ‌కీయాల్లో క‌ర‌ణం వార్త‌ల్లో నిలిచారు.
అంబికా కృష్ణ మాత్రం త‌న త‌ల్లిని భార్య‌గా... త‌న‌ను కుమార్తెగా గుర్తించాల‌ని పెద్ద ఫైటే చేస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే స్థానిక ఎన్నిక‌ల‌లో క‌ర‌ణం వ‌ర్గం పోటీ చేస్తోంది. మునిసిపాలిటీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో క‌ర‌ణం వ‌ర్గం పోటీ చేస్తున్న చోట‌.. అంబికా కృష్ణ యాంటీ ప్ర‌చారం చేస్తున్నారు. అది కూడా కేవ‌లం త‌న తండ్రి మ‌ద్ద‌తుతో రంగంలోకి దిగిన వారు పోటీచేస్తున్న వార్డుల్లో పెద్ద ఎత్తున పోస్ట‌ర్లు అంటించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, మాజీ మంత్రి, పార్టీ కీల‌క నేత లోకేష్‌, దివంగ‌త ఎన్టీఆర్‌, పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వంటివారి ఫొటోలు ముద్రించిన పోస్ట‌ర్‌పై..``అరాచ‌కాల‌కు, దౌర్జ‌న్యాల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌దాం. ప్ర‌జాస్వామ్యాన్ని రక్షించుకుందాం. చంద్ర‌న్న ఆశ‌యాల‌ను గెలిపించుకుందాం. చీరాల గ‌డ్డ‌పై టీడీపీ జెండా ఎగ‌రేద్దాం`` అనే స్లోగ‌న్ల‌తో ఈ ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అస‌లే చీరాల‌లో సొంత పార్టీలోనే సెగ‌తో విల‌విల్లాడుతోన్న క‌ర‌ణంకు ఆయ‌న కుమారుడు వెంక‌టేష్‌కు క‌ర‌ణం అంబికా కృష్ణ వ్య‌వ‌హారం మ‌రింత పొగ పెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  


పుర పోరు : నందికొట్కూరు లో జోరుగా ఎన్నికల ప్రచారం..!!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>