PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/viral-news79cd99ab-b9bd-4267-a141-ccff5041c7c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/viral-news79cd99ab-b9bd-4267-a141-ccff5041c7c2-415x250-IndiaHerald.jpgసాధరణంగా చెత్త అంటేనే పనికిరాదని బయటపడేస్తుంటాం. కానీ అదే చెత్త మనల్ని ధనవంతులుగా మారుస్తుందంటే అస్సలు వదిలిపెట్టం కాదా. అవును నిజంగానే చెత్తతో డబ్బులు సంపాందిస్తున్నారు. కేవలం ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాలతోనే దాదాపు రూ.70 వేల వరకు సంపాదిస్తున్నారు ఓ గ్రామస్తులు. తమ గ్రామంలోని చెత్తతో అవసరమైన నగదును సంపాదిస్తూ... ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఆ గ్రామస్తులు. అదిలేసా సాధ్యం... ఇంతకు ఆ గ్రామం ఎక్కుడందో తెలుసుకుందాం. viral-news;sukanya;panchayati;village;2020;qualification;nijam;lieచెత్తతో డబ్బులు సంపాదిస్తున్న గ్రామం.. ఎక్కడో తెలుసా..!?చెత్తతో డబ్బులు సంపాదిస్తున్న గ్రామం.. ఎక్కడో తెలుసా..!?viral-news;sukanya;panchayati;village;2020;qualification;nijam;lieSat, 06 Mar 2021 12:27:22 GMTసాధరణంగా చెత్త అంటేనే పనికిరాదని బయటపడేస్తుంటాం. కానీ అదే చెత్త మనల్ని ధనవంతులుగా మారుస్తుందంటే అస్సలు వదిలిపెట్టం కాదా. అవును నిజంగానే చెత్తతో డబ్బులు సంపాందిస్తున్నారు. కేవలం ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాలతోనే దాదాపు రూ.70 వేల వరకు సంపాదిస్తున్నారు ఓ గ్రామస్తులు. తమ గ్రామంలోని  చెత్తతో అవసరమైన నగదును సంపాదిస్తూ... ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు  ఆ గ్రామస్తులు. అదిలేసా సాధ్యం... ఇంతకు ఆ గ్రామం ఎక్కుడందో తెలుసుకుందాం.

తెలంగాణలోని హరిదాస్‌పూర్ గ్రామంలో చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఇందుకోసం గ్రామ శివారులో డంపింగ్ యార్డ్ నిర్మించారు. అక్కడ తడి చెత్త వేయడానికి, అలాగే పొడి చెత్త వేయడానికి వేరువేరుగా నిర్మించారు. ఇక గ్రామంలో నుంచి తీసుకువచ్చిన చెత్తను రీ సైక్లింగ్ చేయగలిగే వ్యర్థాలను తీసివేస్తారు. అందులో పనికి రాని చెత్తను అక్కడే కాల్చివేస్తారు. ఆ తర్వాత దాని బూడిదను మళ్లీ ఉపయోగిస్తారు. ఇక తడి చెత్తను కుళ్ళబెట్టి దాని నుంచి ఎరువును తయారు చేస్తారు. కంపోస్ట్ ఎరువును రైతులకు ఎక్స్ పోర్ట్ చేస్తుంటారు. ఇలా చేస్తూ.. దాదాపు రూ.70 వేల వరకు సంపాధిస్తున్నారు. 2020 జూలై నుంచి ఈ కంపోస్ట్ అమ్మడం ప్రారంభించామని.. చుట్టూ పక్కల గ్రామాల నుంచి ఈ కంపోస్ట్ ఎరువుకు మంచి డిమాండ్ ఉందని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఇక ఈ ఎరువును గ్రామాలకు ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ట్రాక్టర్ ను వినియోగిస్తున్నట్లుగా తెలిపారు.

ఈ ఎరువును అమ్మడం వల్ల వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నట్లుగా చెప్పుకోచ్చారు. గ్రామంలో 32 సిసిటివి కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, 20 స్పీకర్లు ఉన్నాయన్నారు. సిసి టివి పర్యవేక్షణ వ్యవస్థ పంచాయతీ కార్యాలయంలోని సర్పంచ్ గదిలో ఉందన్నారు. కార్యాలయంలో పనిచేసేటప్పుడు గ్రామంలో జరుగుతున్న సంఘటనలను ట్రాక్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు. అలాగే 150 చదరపు గజాలలో మహిళా సంఘం భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా చెప్పారు. త్వరలోనే 40 కెవి సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు  చేయనున్నట్లు సర్పంచ్ చెప్పుకోచ్చారు. తమ గ్రామంలో అర్హత కలిగిన అమ్మాయిలందరికీ సుకన్య సమృణి యోజన (ఎస్‌ఎస్‌వై) ఖాతాలను తెరవడం ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఆడపిల్లలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.


కాలేయం శుభ్రపడాలి అంటే ఏం చేయాలో తెలుసా..?

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>