PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-trs-ts-breaking-bjp-latest-politics68063e67-7e58-4f0a-bfce-dda4c9151768-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-trs-ts-breaking-bjp-latest-politics68063e67-7e58-4f0a-bfce-dda4c9151768-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లోని ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అధిక‌ర ప‌క్షం, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార‌స్థాయికి చేరుతోంది. ఒక‌ర‌కంగా నువ్వెంతంటే.. నువ్వెంత‌? ద‌మ్ముంటే చూసుకుందాం.. రా!! అనుకునే స్థాయికి ఈ యుద్ధం చేరుకుంద‌నుకోవ‌చ్చు. ఏ పార్టీకి సంబంధించిన నేతా ఎక్క‌డా త‌గ్గ‌డంలేదు. మాట‌కు మాట‌.. కౌంట‌ర్‌కు ఎన్‌కౌంట‌ర్‌.. తుపాకీకి తుపాకీ అనేరీతిలో ఈ పోరు జ‌రుగుతోంది. అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌క‌న్నా ఎక్కువ పోరు ఈ ఎమ్మెల్సీ స్థానాల కోసం జ‌రుగుతోంది. ap, trs, ts, breaking, bjp, latest, politics;manu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;assembly;minister;central government;research and analysis wing;v;partyచూసుకుందాం..రా!! నువ్వెంతంటే.. నువ్వెంత‌?చూసుకుందాం..రా!! నువ్వెంతంటే.. నువ్వెంత‌?ap, trs, ts, breaking, bjp, latest, politics;manu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;assembly;minister;central government;research and analysis wing;v;partySat, 06 Mar 2021 17:22:00 GMTఅసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌క‌న్నా ఎక్కువ పోరు ఈ ఎమ్మెల్సీ స్థానాల కోసం జ‌రుగుతోంది. ప‌ట్ట‌భ‌ద్రులు ఆద‌రిస్తే త‌మ‌కు పూర్తిస్థాయి మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్లేన‌నే భావ‌న‌లో ప్ర‌ధాన పార్టీలుండ‌టంవ‌ల్లే ఈ త‌ర‌హా ర‌ణ‌రంగం జ‌రుగుతోంది.

జిమ్మిక్కుల‌తో... అడ్డ‌దారుల్లో గెల‌వానుకుంటున్నారు
తెలంగాణ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్ర‌ధాన పార్టీల మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలపై భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ జిమ్మికులతో, అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు ఫొటో పెట్టుకొని ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి టీఆ ర్ ఎస్‌కు ప‌ట్టింద‌ని, పీవీ ఘాట్‌ను కూల్చేస్తామ‌న్న పార్టీ త‌ర‌ఫు ఎలా పోటీచేస్తార‌ని ఆయ‌న కూతురు వాణిని బండి ప్ర‌శ్నించారు. స‌మాజానికి ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు.

ఫామ్‌హౌస్‌కే కేసీఆర్‌
ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అహంకారం తలకెక్కి ఫామ్‌హౌస్‌కే పరిమితంమ‌వుతారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల పేరు చెప్పుకుని మంత్రి పదవి పొందారన్నారు. ఈరోజు వారినే బెదిరించి ఓట్లు రాబట్టేందుకు చూస్తున్నారని విమ‌ర్శించారు. సొంత మనుషుల బదిలీలు, ప‌దోన్న‌తుల  కోసం జీవోలు మార్చిన సంగతి అందరికీ తెలుస‌ని, ముందు వాటిపై దృష్టిసారించి ఆ తర్వాత తమ గురించి మాట్లాడితే బాగుంటుంద‌ని హితవు పలికారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆరు సంవ‌త్స‌రాలుగా తెలంగాణ‌ను నిర్లక్ష్యం చేస్తోంద‌ని, నిధుల‌న్నీ గుజ‌రాత్‌కే త‌ర‌లించుకుపోతోంద‌ని అధికార టీఆర్ ఎస్ పార్టీ నేత‌ల‌ను బీజేపీని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బుల్లెట్ రైలు హైద‌రాబాద్‌కు లేక‌పోవ‌డం, వ‌రంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయ‌డంలేద‌ని కేంద్రం తేల్చేయ‌డం, హైద‌రాబాద్‌కు ఎటువంటి పారిశ్రామిక జోన్ కేటాయించ‌క‌పోవ‌డంపై అధికార టీఆర్ ఎస్ నేత‌లు కూడా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ విష‌యాల‌ను గుర్తుచేస్తూ కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని చెబుతున్నారు. దీంతో కొంత‌కాలంగా ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండానే టీఆర్ ఎస్‌, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ ఆ యుద్ధం ఇంకా ప్ర‌జ్వ‌రిల్లుతోంది.













నందికొట్కూరు నియోజకవర్గంలో ఆగని గొడవలు, కొట్టుకున్న బైరెడ్డి, ఎమ్మెల్యే వర్గాలు

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>