SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/bhagvadgeetha-secretsc5dc9add-da31-4b3f-9436-fe7b41a3ca82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/bhagvadgeetha-secretsc5dc9add-da31-4b3f-9436-fe7b41a3ca82-415x250-IndiaHerald.jpgచాలా మందికి తెలిసిన ప్రకారం భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునిడికి మాత్రమే ఒక్కసారే బోధించాడని అనుకుంటారు. కానీ గీత బోధన చాలా సార్లు చెప్పబడిందని సమాచారం. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలిగే అవకాశముంది. ఇంత పరమ పవిత్రమైన భగవద్గీతను అర్జునుడి కంటే ముందు ఎవరికి చెప్పారు...? ఎప్పుడు బోధించబడింది అని..? భగవద్గీతను ఎవరు భోదించారుbhagvadgeetha secrets;arjuna;geetha;jeevitha rajaseskhar;krishna;surya sivakumar;tara;mahabharatham;sri krishna;sara shrawan;divya bhatnagarఅర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?bhagvadgeetha secrets;arjuna;geetha;jeevitha rajaseskhar;krishna;surya sivakumar;tara;mahabharatham;sri krishna;sara shrawan;divya bhatnagarSat, 06 Mar 2021 06:00:00 GMTగీత బోధన చాలా సార్లు చెప్పబడిందని సమాచారం.  అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలిగే అవకాశముంది. ఇంత పరమ పవిత్రమైన భగవద్గీతను అర్జునుడి కంటే ముందు ఎవరికి చెప్పారు...? ఎప్పుడు బోధించబడింది అని..? భగవద్గీతను ఎవరు భోదించారు అని మిమ్మల్ని అడిగితే మీరు టక్కున కురుక్షేత్రం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడని చెబుతారు. అయితే అంతకు ముందే శ్రీ కృష్ణుడు కొంతమందికి చెప్పారంట...!  ఈ భగవద్గీత ద్వారా సృష్టిలోని ప్రతి ప్రశ్నకు భగవంతుడు సమాధానమిచ్చాడు.

మానవజాతి కనుక భగవద్గీత సారాంశాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తే ఎలాంటి కష్టాలను అనుభవించకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుందట. మనకు తెలిసిన పురాణాల ప్రకారం అర్జునిడికన్నా ముందే భగవద్గీత గురించి సూర్య భగవానుడికి తెలుసునట. ఎలా తెలుసని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగగా, నీకు, నాకు కంటే కూడా ముందు చాలా జన్మలు జరిగాయని అన్నాడు. ఆ జననాల గురించి నీకు తెలియదని, నాకు తెలుసని బదులిచ్చాడు. ఆ తరువాత భగవద్గీత గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది. ఇతడికి వేదవ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్యదృష్టి సాయంతో గీతా బోధనను దృతరాష్ట్రుడికి వినిపించాడు.

ఆ తరువాత మహాభారతాన్ని రచించిన శ్రీ వేద వ్యాసుడు శ్రీ గణేశుడికి గీతాబోధన చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా వేద వ్యాసుడు తన శిష్యులైనటువంటి వైషాంపాయనుడు, జైమిని, పాలసంహితుడికి మహాభారతంలో లోతైన రహస్యాలను ఉపదేశించాడు. ఈ విధంగా మహాభారతాన్ని తన శిష్యులకు చెప్పాడు. ఈ గ్రంథంలోని ముఖ్యమైన ఘట్టాలను వారికీ ఉపదేశించాడు. దీని వలన భగవద్గీత గురించి సకల జనులు తెలుసుకోగలిగారు. వ్యాసుడు శిష్యుడు వైషాంయపనుడు జనమేజయుడికి మహాభారతం గురించి వివరించాడు. ఆ సమయంలోనే ఆయనకు భగవద్గీతను బోధించాడు. ఈ విధంగా అర్జునుడికన్నా ముందు భగవద్గీతను చాలా మంది తెలుసుకున్నారు.


దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>