PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp998d4424-2dc9-429e-a1f7-eb43adcdda8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp998d4424-2dc9-429e-a1f7-eb43adcdda8d-415x250-IndiaHerald.jpgరాజకీయం అంటే అదే. దానికి ఏ బంధంతోనూ అసలు సంబంధం ఉండదు. అది అత్యంత కఠినం. రాగద్వేషాలకు అతీతం. అందుకే పాలిటిక్స్ ని ఎవరూ అర్ధం చేసుకోలేరు. ఇదిలా ఉంటే పుర పోరులో ఢీ అంటే ఢీ కొడుతున్న వైసీపీ టీడీపీల మధ్య ఎవరు విజేత అన్నది అంచనాలకు అందడంలేదు. tdp;view;poorna;vishwa;district;vishakapatnam;fort;winner;ycp;ayyannapatruduపుర పోరు : నర్శీపట్నంలో అయ్యన్నకు బిగ్ షాక్...?పుర పోరు : నర్శీపట్నంలో అయ్యన్నకు బిగ్ షాక్...?tdp;view;poorna;vishwa;district;vishakapatnam;fort;winner;ycp;ayyannapatruduSat, 06 Mar 2021 09:53:54 GMTవైసీపీ టీడీపీల మధ్య ఎవరు విజేత అన్నది అంచనాలకు అందడంలేదు.

విశాఖ జిల్లా అయితే టీడీపీకి కంచుకోట. అంతే కాదు. నర్శీపట్నం మునిసిపాలిటీ పేరు చెప్పగానే అయ్యన్నపాత్రుడి కుటుంబమే గుర్తుకువస్తుంది. అతి చిన్న పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబమే వరసగా పలుమార్లు  పాలన సాగించింది.  ఆ తరువాత‌ మేజర్ పంచాయతీగా మారినా 2013లో మునిసిపాలిటీగా అవతరించినా కూడా నర్శీపట్నం అయ్యన్న కుటుంబం చేతుల నుంచి బయటకు పోలేదు. అలాంటి నర్శీపట్నం మునిసిపాలిటీని ఇపుడు వైసీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయ్యన్న ఫ్యామిలీ అంటే నర్శీపట్నం మునిసిపాలిటీ అన్నట్లుగా ఉన్న సీన్ ని మార్చేయాలనుకుంటోంది. గత ఎన్నికల వేళ అయ్యన్నపాత్రుడి తమ్ముడు, నర్శీపట్నం మునిసిపాలిటీ మాజీ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరిపోవడంతో అక్కడ నాలుగు వేల మెజారిటీ వైసీపీకి వచ్చింది.

దాంతో ఇపుడు మళ్ళీ ఆయన్ని వైసీపీ వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. అయ్యన్న కుటుంబంలో సన్యాసిపాత్రుడి స్టైల్ వేరు. ఆయన రాజకీయమంతా మునిసిపాలిటీతోనే ముడిపడి ఉంది. ఆయనకు గట్టి పట్టు కూడా ఉంది. ఇపుడు ఆయన తన సత్తా చాటనున్నారు. మునిసిపల్ పోరు క్లైమాక్స్ కి చేరిన వేళ బరిలోకి దిగిన అయ్యన్న తమ్ముడు  సీన్ మొత్తం మార్చేయడానికి రెడీ అయిపోయారు. ఈ పరిణామంతో మాజీ మంత్రికి గట్టి షాక్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి నర్శీపట్నం మునిసిపాలిటీని కనుక అయ్యన్న కుటుంబం చేతుల నుంచి తీసుకుంటే వైసీపీకి సంపూర్ణ విజయం దక్కినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎవరు జెండా ఎగరేస్తారో.






పుర పోరు: విజ‌య‌వాడ వైసీపీ మేయ‌ర్ విష‌యంలో జ‌గ‌న్ మార్క్ ట్విస్ట్ ?

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>