MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sekhar-kammula392ac7f3-f37c-48d3-9f6f-c19ab7cbc0af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sekhar-kammula392ac7f3-f37c-48d3-9f6f-c19ab7cbc0af-415x250-IndiaHerald.jpg ఈసమ్మర్ రేస్ కు విడుదలకాబోతున్న లవ్ స్టోరీ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు అన్నీ కావడంతో ఈమూవీ క్రేజ్ మరింత పెరిగింది. ఈమధ్య లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీకి సంబంధించిన ‘సారంగ దరియా’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారడంతో ఈమూవీకి బయ్యర్ల నుండి భారీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్.ఇంత జరుగుతున్నా ఈపరిణామాలను చూసి శేఖర్ కమ్ముల హ్యాపీ గా లేడని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాకు సంబంధించి శేఖర్ కమ్ముల చేసిన ఒక వ్యూహాత్మక పొరపాటు అని తెలుస్తsekhar kammula;view;sekhar;varsha;kamma;cinema;love;tsunami;vegetable market;love story;fidaaశేఖర్ కమ్ముల కు కలిసి రాకుండా పోతున్న లవ్ స్టొరీ ?శేఖర్ కమ్ముల కు కలిసి రాకుండా పోతున్న లవ్ స్టొరీ ?sekhar kammula;view;sekhar;varsha;kamma;cinema;love;tsunami;vegetable market;love story;fidaaSat, 06 Mar 2021 11:00:00 GMTలవ్ స్టోరీ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు ఈసినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు అన్నీ కావడంతో ఈమూవీ క్రేజ్ మరింత పెరిగింది. ఈమధ్య లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీకి సంబంధించిన ‘సారంగ దరియా’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారడంతో ఈమూవీకి బయ్యర్ల నుండి భారీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్.


ఇంత జరుగుతున్నా ఈపరిణామాలను చూసి శేఖర్ కమ్ముల హ్యాపీ గా లేడని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈసినిమాకు సంబంధించి శేఖర్ కమ్ముల చేసిన ఒక వ్యూహాత్మక పొరపాటు అని తెలుస్తోంది. ఈమూవీని మొదలు పెడుతున్నప్పుడు శేఖర్ కమ్ముల తన పారితోషికంగా ఈమూవీ ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నట్లు టాక్. ‘ఫిదా’ మూవీకి రెండు మిలియన్ డాలర్ల కలక్షన్స్ రావడంతో ఆ రేంజ్ లోనే ‘లవ్ స్టోరీ’ మూవీకి కూడ ఓవర్సీస్ లో డాలర్ల వర్షం కురుస్తుందని శేఖర్ కమ్ముల భావించాడు అని అంటారు.


దీనితో ఈసినిమాకు సంబంధించి తాను పారితోషికం తీసుకోకుండా ఓవర్సీస్ రైట్స్ ను శేఖర్ కమ్ముల తీసుకున్నాడు అని అంటారు. అయితే కరోనా పరిస్థితులు వచ్చిన తరువాత ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. లాక్ డౌన్ పరిస్థితులు తొలిగిపోయి తిరిగి మామూలు పరిస్థితులు వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో జనం సినిమాలు చూస్తున్న విధంగా ఇప్పటికీ అమెరికాలో జనం సినిమాలు వైపు రావడం లేదు. కలక్షన్స్ సునామీ సృష్టించిన ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బష్టర్ మూవీకి కూడ అమెరికాలో చాల తక్కువగా కలక్షన్స్ వస్తున్నాయి.


ఇలాంటి పరిస్తిత్లలో’ లవ్ స్టోరీ’ మూవీకి ఓవర్సీస్ మార్కెట్ లో బయ్యర్ల నుండి పెద్దగా భారీ ఆఫర్లు శేఖర్ కమ్ములకు రావడంలేదు అని టాక్. దీనితో ధైర్యం చేసి తానే ఓవర్సీస్ లో ఈ మూవీని విడుదల చేసినా ‘ఉప్పెన సినిమాను పట్టించుకోని విధంగా ఓవర్సీస్ ప్రేక్షకులు లవ్ స్టోరీ మూవీని కూడ పట్టించుకోకపోతే తెలుగు రాష్ట్రాలలో ఈసినిమా విజయం సాధించినా తనకు మిగిలేది ఏమి లేదని శేఖర్ కమ్ముల భయపడుతున్నట్లు టాక్. దీనితో తన దగ్గర ఉన్న ‘లవ్ స్టోరీ’ ఓవర్సీస్ రైట్స్ ను ఎదో విధంగా అమ్మి ఈటెన్షన్ నుండి బయటపడాలని శేఖర్ కమ్ముల గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ గాసిప్పులు వినిపిస్తున్నాయి..  






ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>