MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rrr-filme2fc1e3c-b3cf-413e-a73c-b0106626ded3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rrr-filme2fc1e3c-b3cf-413e-a73c-b0106626ded3-415x250-IndiaHerald.jpgఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ విషయంలో రాజమౌళి వెనకడుగు వేస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బోనీ కపూర్ నిర్మించిన బాలీవుడ్ సినిమా మైదాన్ అక్టోబర్ 15వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని చాలా రోజుల ముందుగానే బోనీకపూర్ లాంచ్ చేశారు. ఈ విషయం తెలిసి కూడా రెండు రోజులు ముందుగా అనగా అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. దీనితో బోనీకపూర్ రాజమౌళి పై విరుచుకుపడ్డారు. అయితే దసరా rrr film;boney kapoor;kranthi;kranti;rajamouli;dussehra;makar sakranti;bollywood;rrr movie;cinema;sankranthi;january;festival;october;vijayadashamiఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసిన రాజమౌళి..ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసిన రాజమౌళి..rrr film;boney kapoor;kranthi;kranti;rajamouli;dussehra;makar sakranti;bollywood;rrr movie;cinema;sankranthi;january;festival;october;vijayadashamiSat, 06 Mar 2021 15:00:00 GMTఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ విషయంలో రాజమౌళి వెనకడుగు వేస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బోనీ కపూర్ నిర్మించిన బాలీవుడ్ సినిమా మైదాన్ అక్టోబర్ 15వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని చాలా రోజుల ముందుగానే బోనీకపూర్ లాంచ్ చేశారు. ఈ విషయం తెలిసి కూడా రెండు రోజులు ముందుగా అనగా అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. దీనితో బోనీకపూర్ రాజమౌళి పై విరుచుకుపడ్డారు.


అయితే దసరా పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ ని రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారని.. రిలీజ్ డేట్ విషయంలో తనకు అస్సలు సంబంధం లేదని చెబుతూ బోనికపూర్ నుంచి రాజమౌళి తప్పించుకున్నారు. రిలీజ్ డేట్స్ విషయంలో బోనీకపూర్ రాజమౌళి పై మాటలు కూడా జారారు కానీ ఆర్ఆర్ఆర్ సినిమా డేట్ మాత్రం మార్చలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ మారబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా లొకేషన్ లలో జరుగుతూనే ఉంది. షూటింగ్ పనులు పూర్తయ్యే సరికి కనీసం నాలుగైదు నెలలు పడుతుందని తెలుస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత సినిమాకు సంబంధించిన సన్నివేశాలు యొక్క విజువల్ ఎఫెక్ట్స్ కూడా పూర్తిచేయాల్సి ఉంది. ఐతే రాజమౌళి ఔట్ పుట్ విషయం లో ఏమాత్రం కాంప్రమైజ్ కారు కాబట్టి సినిమా సంబంధిత పనులన్నీ అక్టోబర్ 13వ తేదీ నాటికి పూర్తవుతాయా అనే సందేహం వ్యక్తమవుతోంది.


ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రాజమౌళి ప్రశాంతంగా కావలసినంత సమయం తీసుకొని ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి ఏడాది జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే గనుక జరిగితే బోనీకపూర్ కి రాజమౌళి చిత్ర బృందానికి ఎటువంటి తగాదాలు ఏర్పడవు.


ఎస్బిఐ బంపర్ ఆఫర్.. కేవలం వారి కోసమే..?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>