SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/krishnakumari59605f0f-7e51-475a-85bc-ef7fa30dd928-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/krishnakumari59605f0f-7e51-475a-85bc-ef7fa30dd928-415x250-IndiaHerald.jpgఅల‌నాటి కన్నడ, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో రెండున్నర దశాబ్దాలకు పైగా యువత, కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు కృష్ణ‌కుమారి ( మార్చి 6, 1933 - జనవరి 24, 2018). ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ లాంటి అగ్రనటులతో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కృష్ణకుమారి తండ్రి వెంకోజీరావుగారు, తల్లి శచీదేవిగారు కలకత్తాలో నివసించే సమయంలో కృష్ణకుమారి జన్మించారు. వెంకోజీరావుగారు ఆంధ్రా పేపర్ మిల్లులో పేపర్ ఎక్స్ పర్ట్ గా వర్క్ చేసేవారు. కృష్ణకుమారి జననం అనంతరం కుటుంబం మొత్తం రాజమండ్రి షిఫ్ట్ అయ్యాkrishnakumari;ntr;kumaar;jaggaiah;kishore;krishna;nageshwara rao akkineni;rathi;savitri;sowkar janaki;england;bollywood;cinema;january;tamil;kannada;hindi;chennai;sex;nandamuri taraka rama rao;father;march;savithri 1;rajahmundryహెరాల్డ్ స్మ‌రామీ : నాటి కుర్ర‌కారు క‌ల‌ల రాకుమారి... అల‌నాటి కృష్ణ‌కుమారిహెరాల్డ్ స్మ‌రామీ : నాటి కుర్ర‌కారు క‌ల‌ల రాకుమారి... అల‌నాటి కృష్ణ‌కుమారిkrishnakumari;ntr;kumaar;jaggaiah;kishore;krishna;nageshwara rao akkineni;rathi;savitri;sowkar janaki;england;bollywood;cinema;january;tamil;kannada;hindi;chennai;sex;nandamuri taraka rama rao;father;march;savithri 1;rajahmundrySat, 06 Mar 2021 06:30:00 GMTకన్నడ, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో రెండున్నర దశాబ్దాలకు పైగా యువత, కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు కృష్ణ‌కుమారి ( మార్చి 6, 1933 - జనవరి 24, 2018). ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ లాంటి అగ్రనటులతో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కృష్ణకుమారి తండ్రి వెంకోజీరావుగారు, తల్లి శచీదేవిగారు కలకత్తాలో నివసించే సమయంలో కృష్ణకుమారి జన్మించారు. వెంకోజీరావుగారు ఆంధ్రా పేపర్ మిల్లులో పేపర్ ఎక్స్ పర్ట్ గా వర్క్ చేసేవారు. కృష్ణకుమారి జననం అనంతరం కుటుంబం మొత్తం రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు. ఆమె అక్క షావుకారు జానకి. చెన్నై నుంచి వలసరావడం, తండ్రి ఇంగ్లాండ్ లో మూడేళ్లపాటు ఉండడంతో ఇంట్లో అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారట. అయితే.. పిల్లలకి తెలుగు మాట్లాడడం రావడం కంపల్సరీ అని చెప్పి ఒక మాష్టారును ఇంటికి పిలిపించి మరీ ట్యూషన్ చెప్పించేవారట. ఇక అక్కయ్య షావుకారు జానకి నాట్యం నేర్చుకొంటున్నప్పుడు కృష్ణకుమారి కూడా కాలికి గజ్జె కట్టుకొని ఆడేవారట.


తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 25 సంవత్సరాలకు పైగా 150 పై చిలుకు చిత్రాల్లో నటించింది. మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది. కోల్ కతాలో జన్మించిన ఈమె తండ్రి ఉద్యోగరీత్యా పలుచోట్ల నివాసముంది. చెన్నైలో ఉండగా సినిమా రంగంలోకి ప్రవేశించింది. వివాహం తరువాత భర్తతో కలిసి బెంగుళూరుకు నివాసం మార్చింది.మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 150 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు, కొన్ని తమిళ భాషా చిత్రాలు. మూడు భాషల చిత్రాల్లోనూ ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించింది.



బాలీవుడ్ లో కిశోర్ కుమార్ తో ఒకే ఒక సినిమాలో కథానాయికగా నటించింది. అప్పటికి హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి పేరుతో వేరే నటి ఉండటంతో రతి అనే పేరుతో పరిచయం అయింది. దాని తర్వాత బాలీవుడ్ లో పలు అవకాశాలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమను వదిలి వెళ్ళలేదు. 1963 లో కృష్ణకుమారి 16 సినిమాల్లో కథానాయికగా నటించింది. ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇందుకోసం ఈమె మూడు నెలలపాటు మూడు షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేసింది.ఈమెకు మూడుసార్లు జాతీయ అవార్డులు, రాష్ట్రస్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు గెలుచుకున్నది. బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ వారి లైఫ్ టైం అచీవ్‍ట్ అవార్డు పోందినది.అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణకుమారి 2018, జనవరి 24 ఉదయం బెంగుళూరులో మరణించారు.




కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగితే ఓకేనా.. నిర్మలమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>